పిల్లలకు తల్లిదండ్రులు కచ్చితంగా నేర్పించాల్సిన విషయాలు..!
జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదని... కష్టాలు కూడా వస్తాయనే విషయం వారికి చెప్పాలి. అప్పుడు జీవితంలో వచ్చే సమ్యలను వారు ఎదుర్కొనగలరు.
పిల్లలు మట్టి లాంటివారు. మట్టిని మనం ఎలా మలిస్తే.. ఆ రూపం వస్తుంది. అదేవిధంగా.. పిల్లలు కూడా అంతే.. మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. కాబట్టి.. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారికి మనం జీవితానికి సంబంధించిన విషయాలను, నియమాలను తెలియజేయాలి. వారికి అర్థమయ్యేలా చెప్పాలి. కచ్చితంగా పిల్లలకు నేర్పించాల్సిన విషయాలేంటో ఓసారి చూద్దాం...
జీవితం ఎల్లప్పుడూ నిండు పున్నమిలా ఉండదు.జీవితంలోని ఈ కఠినమైన వాస్తవికతను అర్థం చేసుకోవడం ఒక చిన్న పిల్లవాడికి కష్టంగా ఉన్నప్పటికీ, అది నెమ్మదిగా అతని మనస్సులో మీరు చేర్పించాలి. జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదని... కష్టాలు కూడా వస్తాయనే విషయం వారికి చెప్పాలి. అప్పుడు జీవితంలో వచ్చే సమ్యలను వారు ఎదుర్కొనగలరు.
మానసికంగా బలంగా, తెలివిగా ఉండటం కూడా పిల్లలకు నేర్పించాలి. మానసికంగా తెలివైన వ్యక్తులు వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. వారి భావోద్వేగాలు ఇతరులపై ఎలాంటి ముద్ర వేస్తాయో కూడా తెలుసుకుంటారు. ఇది నేర్పించడానికి పిల్లలకు కథల ద్వారా మోటివేట్ చేయవచ్చు.
కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ కూడా పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. పిల్లలకు బాడీ లాంగ్వేజ్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉండటమెలాగో నేర్పించడం చాలా అవసరం. మీరు దీన్ని మీ పిల్లలకు రోల్ మోడల్స్ ద్వారా నేర్పించాలి. దాని కోసం లెజెండ్స్, సెలబ్రిటీల గురించి వారికి చెప్పండి. బాడీ లాంగ్వేజ్ గురించి చిట్కాలు, ట్రిక్స్ వారికి నేర్పండి.
క్లియర్ కమ్యూనికేషన్.. ఇది ఎవరికైనా చాలా అవసరం. మనం ఎదుటి వ్యక్తికి ఎదైనా విషయాన్ని తెలియజేసే టప్పుడు.. దానికి సరిగా కమ్యూనికేట్ చేయగలగాలి. అలా చేయగలిగిన వారు చాలా శక్తివంతులౌతారు. వారిలో ఆత్మ విశ్వాసం కూడా పెంచుతుంది.
న్యాయం వైపు నిలపడటం అనే విషయాన్ని కూడా మనం పిల్లలకు నేర్పించాలి. అంతేకాదు తమకు ఉన్న ఆసక్తులు, హక్కుల గురించి కూడా సమర్థవంతంగా తెలియజేయలిగేలా నేర్పించాలి. వారు తీసుకునే నిర్ణయాలకు వారే బాధ్యత వహించేలా చూడాలి. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తిని ఇవ్వాలి.