పిల్లలు పుస్తకాలను చదవాలంటే తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే.. !
కొంతమంది పిల్లలు చదువులో ముందుంటే.. మరికొంతమంది పిల్లలు మాత్రం బాగా వెనకబడిపోతుంటారు. ఇలాంటి పిల్లలు బాగా చదవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా?
Image: Getty
పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఎలాంటి పరిస్థితులకైనా తట్టుకోగలుగుతారు. కానీ చదివే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉండదు. అందుకే పుస్తకాలను చదివే అలవాటు చిన్నతనం నుంచే నేర్పించాలి. ఇందుకోసం కేవలం స్కూల్ పుస్తకాలను చదివితే సరిపోదు. జ్ఞానాన్ని పొందాలంటే మాత్రం చిన్నప్పటి నుంచే సామాజిక న్యాయం కథలు, జ్ఞాపకశక్తి పెంపొందించే పుస్తకాలను చదవడం పిల్లలకు నేర్పించాలి. మీ పిల్లలు చదవులో వెనకబడితే వారికి పఠన నైపుణ్యాలను ఎలా పెంపొందించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
reading
నేటితరం పిల్లలు మొబైల్ కు బానిసలవుతున్నారు. కానీ ఈ అలవాటు పిల్లల్ని చదువుకు దూరం చేస్తుంది.ఈ అలవాటున్న పిల్లలు చదవడం పెద్ద సవాలే. ఇలాంటి పిల్లలు చదవులో రాణించాలంటే మాత్రం తల్లిదండ్రులు రంగురంగుల పుస్తకాలను, బొమ్మలను వారికోసం తీసుకురావాలి. ముఖ్యంగా పురాణాలు, నైతిక సామెతలపై పుస్తకాలను కొనివ్వండి. ముందు ఆ పాత్రల ఫొటోలు చూస్తే చాలు. ఇది వారి ఊహాశక్తిని పెంపొందించడానికి బాగా సహాయపడుతుంది.
ఆ తర్వాత పిల్లల్ని సంతోషపెట్టడానికి తెనాలి రామలింగం కథల పుస్తకాలును, నైతిక ఆలోచనలు పెంపొందించే పుస్తకాలు కొని మీ ఇంట్లో చక్కగా అమర్చండి. ఈ పుస్తకాలు మీ పిల్లల్లో పఠన నైపుణ్యాలు పెంపొందించడానికి బాగా సహాయపడతాయి. అయితే పిల్లలు ఒక్కరే చదవడం కష్టం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్తో కూర్చుని కథా పుస్తకాలను చదవాలి. కథలు చదివినప్పుడు, చెప్పినప్పుడు, అవి వారి మనస్సులో లోతుగా పాతుకుపోతాయి. దీంతో వారు కూడా కాలక్రమేణా ఆ పుస్తకంతో ప్రేమలో పడిపోతారు.
మీ పిల్లలు బాగా చదవాలనుకుంటే చిన్న వయస్సు నుంచే బిగ్గరగా చదవమని చెప్పండి. మీకు తెలుసా? బిగ్గరగా చదివితే సిగ్గు పోతుంది. ఇది నాలుకకు మంచి వ్యాయామం కూడా అవుతుంది. అది ఒక స్టోరీ బుక్? లేదా పిల్లల స్కూల్ బుక్ అయినా సరే. అలాగే ఏదైనా చదివేటప్పుడు ఏవైనా డౌట్స్ వచ్చే వెంటనే అడగమని చెప్పండి. తల్లిదండ్రులు సరైన సమాధానం చెబితే పిల్లలకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
పిల్లల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించడానికి వారికి కొంత సమయం కేటాయించాలి. అలాగే వారు తొందరగా పుస్తకాలను చదివే అలవాటును అలవర్చుకోవడానికి అప్పుడప్పుడు బహుమతులను కూడా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు బాగా చదవగలుగుతారు.