ఈ కాలం పేరెంట్స్ కి సూధామూర్తి ఇచ్చే బెస్ట్ టిప్స్ ఇవి...!
మనం మనకు నచ్చినది నేర్పించడం మొదలుపెట్టి.. దానిపై ఫోకస్ పెట్టడం వల్ల... వారిలో ఉన్న టాలెంట్ ని కూడా గుర్తించలేరు. కాబట్టి... ముందు వాళ్లకు ఇష్టమైనది ఏంటి..? వారు ఏది చేయగలరు అనే విషయంపై దృష్టి పెట్టాలి.
పిల్లలను కన్న ప్రతి ఒక్కరూ పేరెంట్స్ అవుతారు. అందులో కొత్తమీ లేదు. కానీ.. మంచి పేరెంట్స్ గా మారాలన్నా.. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం కాస్త ఎక్కువగా కష్టపడాలి. అయితే... మీరు కనుక మంచి పేరెంట్ అవ్వాలి అనుకుంటే మాత్రం.. కచ్చితంగా సుధామూర్తి చెప్పే ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే.
parents
చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల విషయంలో అతి జాగ్రత్తలు చూపిస్తూ ఉంటారు. ఎంతలా అంటే.. పిల్లలకు కనీసం వారి నిర్ణయాలు వారు తీసుకునే అవకాశం కూడా ఇవ్వరు. పిల్లలకు ఏం కావాలి..? ఏం చేయాలో కూడా అన్నీ నిర్ణయాలు పేరెంట్సే తీసుకుంటారు. కానీ.. కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు పిల్లలు తీసుకునే ఛాన్స్ ఇవ్వాలని సుధామూర్తి చెబుతారు. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడం వల్ల... పిల్లలకు డెసిషన్ మేకింగ్ అలవాటు అవుతుంది.
చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లల విషయంలో ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు.అయితే.. మరీ అంత ఫోకస్ పెట్టకూడదని సుధామూర్తి చెబుతున్నారు. ఎందుకంటే... పేరెంట్స్ మరీ ఎక్కువగా పిల్లల విషయంలో జోక్యం చేసుకుంటే... వారిలో ఉన్న స్పెషల్ టాలెంట్ బయటపడదట. మనం మనకు నచ్చినది నేర్పించడం మొదలుపెట్టి.. దానిపై ఫోకస్ పెట్టడం వల్ల... వారిలో ఉన్న టాలెంట్ ని కూడా గుర్తించలేరు. కాబట్టి... ముందు వాళ్లకు ఇష్టమైనది ఏంటి..? వారు ఏది చేయగలరు అనే విషయంపై దృష్టి పెట్టాలి.
3.ఈ కాలం పిల్లలు చాలా మొండిగా ఉంటున్నారు. తమకు కావాల్సిన దానిని, తమకు నచ్చిన విషయాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడం లేదు. ఈ విషయంలో పిల్లలను బాధపెట్టడం ఇష్టంలేక.. పేరెంట్స్ కూడా వాళ్లకు సపోర్ట్ ఇస్తుంటారు. కానీ.... అలా ఉండకూడదని.. పిల్లలకు షేరింగ్ అనేది కచ్చితంగా నేర్పించాలని సుధామూర్తి అంటున్నారు.
4.కొందరు పేరెంట్స్.. తమ పిల్లలు ఏదైనా సాధించలేకపోతే.. వాళ్లపై తెగ అరిచేస్తూ ఉంటారు. అది చెయ్యి.. ఇది చెయ్యి అని అరుస్తూ ఉంటారు. కానీ... అలా అరవకూడదట. పిల్లలకు మంచి ఉదాహరణగా పేరెంట్స్ నిలవాలి. మీరు.. వారికి మంచి ఉదాహరణగా నిలవడం వల్ల.. వారు మీ నుంచి మంచి విషయాలు నేర్చుకుంటారు అని గుర్తుపెట్టుకోవాలి అని సుధామూర్తి చెబుతున్నారు.
5. పిల్లలకు, పేరెంట్స్ కి జనరేషన్ గ్యాప్ ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. కొంత వయసు వచ్చిన తర్వాత... పిల్లలకంటూ.. వారికి ఒక రూమ్ కేటాయించాలి. వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించడం మొదలుపెట్టాలి. అప్పుడే.. పిల్లలను పేరెంట్స్ సరిగా అర్థం చేసుకోగలరు.