MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లల్ని క్రమశిక్షణలో ఎలా పెట్టాలి?

పిల్లల్ని క్రమశిక్షణలో ఎలా పెట్టాలి?

పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ లాంటిదే. ఎందుకంటే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది చేయరు. నిజానికి పిల్లలు ఇలా చేయడానికి తల్లిదండ్రులే కారణం. మాట వినడం లేదని పేరెంట్స్ పిల్లల్ని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. అసలు పిల్లల్ని క్రమశిక్షణలో ఎలా పెట్టాలో తెలుసా?   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 02 2024, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


మన జీవన విధానం చాలా ఫాస్ట్ గా మారిపోతోంది. దీంతో తల్లిదండ్రులకు కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడమే పెద్ద సవాలు. పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పించాలనేది ప్రతి తల్లిదండ్రుల మదిలో మెదిలే మొదటి ప్రశ్న. దీనికోసం ఎన్నో చేస్తుంటారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతుంటారు. తిడుతుంటారు. కానీ మీ పిల్లల ప్రవర్తన బాగుండాలంటే మాత్రం చిన్న వయసు నుంచే వారికి క్రమశిక్షణ నేర్పించాలి. ముఖ్యంగా రెండు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు  నుంచే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఈ వయసు పిల్లలు తొందరగా మాట వింటారు. అసలు పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


చెప్పనవసరం లేదు, చేయాల్సిందే

పిల్లలు మన మాటల కంటే చేతల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. అందుకే వాళ్లను క్రమశిక్షణలో పెట్టడానికి ముందు మీరు క్రమశిక్షణతో ఉండాలి. ముఖ్యంగా వారితో మాట్లాడేటప్పుడు అసభ్యకరమైన పదాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే పిల్లలు మీ మాటలు బాగా వింటారు. అలాగే మాట్లాడుతారు కాబట్టి. మీరు చెడుగా మాట్లాడి మీ పిల్లలు మంచిగా మాట్లాడాలనుకోవడం దండగ. కాబట్టి వాళ్లు ఏం చేయాలో మీరే చేసి చూపించండి. మీ పిల్లలు మీరు ఎలా ఉంటే వారు కూడా అలాగే ఉంటారు. అరవడం వల్ల పిల్లలకు ఏదీ నేర్పించలేం. 
 

36

లాజిక్ తో ..

పిల్లలకు ఏదైనా బిహేవియరల్ పాఠాలు చెప్పేటప్పుడు, వారి మనస్సులో తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. వాళ్లకు తెలియని విషయాలను చెప్పండి. కాదు అనుకున్న దాన్ని అవుతుందని చెప్పండి. ఇది మీ పిల్లవాడు మీరు చెప్పే ప్రతిదాన్ని జీర్ణించుకునేలా చేస్తుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు కొట్టడం, తిట్టడం లాంటివి చేయకండి. 
 

46


మొదటి తప్పుతో ఆపండి

పిల్లల ప్రవర్తనలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. చాలాసార్లు తల్లిదండ్రుల వల్లే పిల్లలు తప్పులు చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఏదైనా చెడు మాటలు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఏమీ అనకుండా నవ్వుకుంటారు. ఇతరుల విషయం పక్కన పెడితే తల్లిదండ్రులు కూడా ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే పేరెంట్స్ ఏమీ అనడం లేదని పెద్దవారైనా పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. మాట్లాడుతారు. దీనివల్ల తల్లిదండ్రులుగా మీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మొదటి తప్పుతోనే మీ పిల్లల్ని ఆపండి. ఇందుకోసం మీరు కోపగించుకోవాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇది మంచి అలవాటు కాదని నిదానంగా చెప్పండి. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. 

56

కోరిక, మొండితనం మధ్య వ్యత్యాసం 

చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల కోరికలను తీర్చే ప్రయత్నంలో మొండిగా చేస్తారు. అంటే ఒకటి కావాలంటే అది కొనిచ్చిందాకా ఏడుస్తారు. అలుగుతారు. అందుకే పిల్లల కోరికకు, మొండితనానికి మధ్య తేడాను తెలుసుకోవాలి. పిల్లలు చెప్పే ప్రతిదీ తల్లిదండ్రులు చేయలేరని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు కోరికలను మొండితనంగా మార్చుకోకుండా ప్రయత్నించాలి.
 

66

మంచిని చెప్పాలి

పిల్లలు తప్పులు చేస్తే అడ్డుకోవడం ఎంత ముఖ్యమో, మంచి చేసినప్పుడు మెచ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. పిల్లలు మంచి అలవాట్లు అలవర్చుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్లు ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రశంసించాలి. ప్రోత్సహించండి. ఇది పిల్లలకి మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved