రాత్రి పడుకునేముందు పిల్లలకు పేరెంట్స్ ఏం చెప్పాలో తెలుసా?
ఇక.. పిల్లలు తమకు రోజులో జరిగిన ప్రతి విషయాన్ని తమ పేరెంట్స్ కి చెప్పుకోవాలని అనుకుంటారు. కానీ.. పేరెంట్స్ వాళ్ల పనిలో ఉండి వినిపించుకోకపోవడం, విసుక్కోవడం చేస్తూ ఉంటారు
పిల్లలు ఉదయాన్నే స్కూల్ కి వెళ్లి... సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తూ ఉంటారు. మనం కూడా ఉదయం పూట ఆఫీసు వర్క్, ఇంటి పనులతో బిజీగా ఉంటాం. నిజానికి స్కూల్ కి వెళ్లే పిల్లలతో పేరెంట్స్ కి మాట్లాడే సమయం ఎక్కువగా దొరకదు. స్కూల్ కి వెళ్లి వచ్చిన తర్వాత.. పిల్లలు.. హోం వర్క్స్ అని.. అవీ ఇవీ అంటూ సమయం గడిపేస్తారు. కానీ.. పిల్లలతో కచ్చితంగా పేరెంట్స్ మాట్లాడాలి. మాట్లాడే సమయం దొరకకపోతే.. కనీసం రాత్రి పడుకునే ముందు ఒక ఐదు, పది నిమిషాలైనా వారితో మాట్లాడాలి.
రాత్రిపూట పిల్లలతో మాట్లాడాలి అన్నారు కదా.. అని కోపంగా ఏది పడితే అది మాట్లాడకూడదు. వారితో ప్రేమగా మాట్లాడాలి. ముఖ్యంగా ఈ కింది విషయాలను మీరు మీ పిల్లలతో మాట్లాడితే.. వారికి మేలు జరుగుతుంది. ఆ విషయాలేంటో ఓసారి చూద్దాం..
మీరు కనక ఆరోజు మీ పిల్లలతో గడిపితే.. ఆ విషయం గురించి మీరు వారితో పడుకునే ముందు మాట్లాడాలి. నాకు ఈ రోజు నీతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉందని వాళ్లకు చెప్పాలి. అలా చెప్పడం వల్ల కుటుంబ బాండింగ్ పెరుగుతుంది. పిల్లల్లో సానుకూల అభిప్రాయాలు కలుగుతాయి. వారి నిద్ర కూడా ప్రశాంతంగా పోగలరు.
అందరు పిల్లలు ఒకేలా ఉండరు. ఒక్కొక్కరిలో ఓ ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది.ఆ క్వాలిటీని పేరెంట్స్ గుర్తించాలి. ఆ విషయాన్ని పిల్లలకు చెబుతూ.. మీరు నాకు చాలా స్పెషల్ అంటూ పిల్లలకు చెప్పాలి. దీని వల్ల.. పేరెంట్స్ కీ, పిల్లలకు మధ్య ఉన్న బంధం బలపడుతుంది. వారి గుండెల్లో మీకంటూ స్పెషల్ ప్లేస్ లభిస్తుంది.
ఇక.. పిల్లలు తమకు రోజులో జరిగిన ప్రతి విషయాన్ని తమ పేరెంట్స్ కి చెప్పుకోవాలని అనుకుంటారు. కానీ.. పేరెంట్స్ వాళ్ల పనిలో ఉండి వినిపించుకోకపోవడం, విసుక్కోవడం చేస్తూ ఉంటారు. రోజులో వినకపోయినా.. కనీసం రాత్రి పడుకునే ముందు అయినా వారి రోజు ఎలా గడిచింది. వారు ఏదైనా మీకు చెప్పాలని అనుకుంటున్నారా..? ఈ విషయాలన్నీ మీరు వారిని అడిగి తెలుసుకోవాలి.
ఇక.. పిల్లలకు మేం ఉన్నాం అనే ధైర్యాన్ని ఇవ్వాలి. చాలా మంది పిల్లలు.. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ఏం చేసినా. ఎవరు ఏమంటారా అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా.. పిల్లలకు మేం ఉన్నామని.. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు తాము సహాయం చేస్తామనే ధైర్యాన్ని వారికి మీరు చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల.. పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
పిల్లలు చేసిన పనులు చెప్పుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ.. పిల్లలు ఏం చేసినా.. నువ్వు మా బిడ్డ అయినందుకు చాలా గర్వంగా ఉంది అని చెబుతూ ఉండాలి. అలా చెప్పడం వల్ల.... కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. చాలా సంతోషిస్తారు కూడా.
పిల్లలు ఏదైనా ఐడియాలు షేర్ చేసుకుంటే.. వాటిని విని ఏంటీ చెత్త ఐడియాలు అని తిట్టడం కంటే.. వారి ఆలోచనలు, ఐడియాలను మెచ్చుకోవాలి. అప్పుడే వారు ఇంకా మంచి ఐడియాలు ఆలోచించడానికి ఆసక్తి చూపిస్తారు. లేదంటే.. వారి ఆలోచలకు పదునుపెట్టడమే మానేస్తారు.
పిల్లలు ఏదైనా ప్రయత్నించి ఓడిపోయినప్పుడు వాళ్లను డిస్కరేజ్ ఛేయకూడదు. ఇంకాస్త ఎంకరేజ్ చేయాలి. గెలవకపోయినా.. బాగా ప్రయత్నించావు అనే విషయం వారికి చెప్పాలి. అప్పుడే రెండోసారి వారు గెలవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నీ మీరు వారికి.. రాత్రిపూట చెప్పడం వల్ల.. ఎక్కువగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది.