పిల్లల్లో తెలివితేటలు పెంచే ఫుడ్స్ ఇవి....!
బ్రెయిన్ ఎదుగుదలకు ఎంతగానో సహాయ పడతాయి. కాబట్టి.. తరచుగా పిల్లలకు ఆహారంలో చేపలను భాగం చేయాలి.
తమ పిల్లలు తెలివిగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లల్లో తెలివితేటలు పెరగాలంటే.. అది మన చేతుల్లోనే ఉంటుంది. వారికి మనం అందించే ఆహారమే.. వారిలో తెలివి తేటలు పెరిగేలా చేస్తాయి. మనం వారికి ఎలాంటి ఆహారం అందించాలో ఓసారి చూద్దాం...
1.కోడిగుడ్లలో ప్రోటన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఎసెన్షియల్ ప్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ పిల్లలకు కోడిగుడ్లు పెట్టడం వల్ల.. వారి బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.
2.చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా... బ్రెయిన్ ఎదుగుదలకు ఎంతగానో సహాయ పడతాయి. కాబట్టి.. తరచుగా పిల్లలకు ఆహారంలో చేపలను భాగం చేయాలి.
grain shortage
3.అన్ని పప్పులను సైతం పిల్లల ఆహారంలో భాగం చేస్తూ ఉండాలి. వీటిలో ఫైబర్, విటమిన్- బి పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా... మొదడుకు సంబంధించిన నరాలు ఉత్తేజితమైతాయి.
steal cut oats
4.ఓట్స్ లో విటమిన్ ఈ, విటమిన్ బి, పొటాషియం, జింక్ లాంటి న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా పిల్లల్లో తెలివితేటలు పెంచడానికి సహాయం చేస్తాయి.
5.బెర్రీస్ లో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇనప్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగాఉంటాయి. ఇవి కూడా మొదడు ఆరోగ్యంగా పెరగడానికి సహాయం చేస్తాయి.
spinach
6.ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో పాలకూర మరింత ఉత్తమం. పాల కూరలో విటమిన్ కే, బేటా కెరోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం.
7.బ్రొకలీ లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు బెస్ట్ ఫుడ్ గా చెప్పొచ్చు.
8. చాక్లెట్స్ ని ఇష్టపడని పిల్లలు ఎవరూ ఉండరు. కాబట్టి... డార్క్ చాక్లెట్ ని వారికి ఇస్తూ ఉండాలి. డార్క్ చాక్లెట్ పిల్లలకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు కూడా సహాయం చేస్తుంది.
avacado
9.అవకాడోస్ లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని వారి ఆహారంలో భాగం చేయడం వల్ల కూడా వారు బ్రెయిన్ ఎదగడానికి సహాయం చేస్తుంది.
10.ఇవి మాత్రమే కాదు... పిల్లలు ప్రతిరోజూ పాలు తాగేలా చూసుకోవాలి. పాలల్లో ప్రోటీన్, బి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా బ్రెయిన్ ఆరోగ్యానికి సహాయం చేస్తాయి.
11.బాదం పప్పు, గుమ్మడి గింజల్లో సైతం పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు ఉపయోగపడే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి వారి ఎదుగుదలకు చాలా అవసరం.