మీ పిల్లలకు ఇలాంటి ఆహారం పెడుతున్నారా.. జాగ్రత్త..!
పోషకాహారంతో పాటు.. మనం తెలీకుండానే పిల్లలకు కొన్ని అనారోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. పిల్లలు ఇష్టపడుతున్నారు కదా... అని వారికి ఆ ఆహారం అందిస్తుంటాం.
kids food
పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలని... వారికి అన్ని పోషకాలు అందించాలని ప్రతి తల్లిదండ్రులు తపన పడుతూ ఉంటారు. అయితే... పోషకాహారంతో పాటు.. మనం తెలీకుండానే పిల్లలకు కొన్ని అనారోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. పిల్లలు ఇష్టపడుతున్నారు కదా... అని వారికి ఆ ఆహారం అందిస్తుంటాం. అయితే.. పిల్లలకు అస్సలు అందించకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
children health food
జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయం మనకు తెలుసు. అయితే.. కొన్ని జంక్ ఫుడ్స్ మరింత ప్రమాదకరంగా ఉంటాయట. అవేంటో ఓసారి చూద్దాం...
1. చాలా మంది తమ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లో సెరెల్స్ పెడుతూ ఉంటారు. ఇది గ్రెయిన్స్ తో తయారు చేస్తారు. కానీ... గ్రెయిన్స్ ని ఎక్కువగా ప్రాసెస్డ్ చేస్తారు. అంతేకాదు.. వీటిలో కృత్రిమ రంగులు కలుపుతూ ఉంటారు. అంతేకాకుండా షుగర్ కూడా యాడ్ చేస్తారు. కాబట్టి... వీటిని పిల్లలకు పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
potato chips
2.పిల్లలు ఇష్టంగా తినే మరో స్నాక్ పొటాటో చిప్స్. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అవి పెరిగే పిల్లలకు అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా కిడ్నీలకు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. అంతేకాదు.. శరీరంలో కొలిస్ట్రాల్ లెవల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వీటిని పిల్లలకు అందించకుండా ఉండటమే మంచిది.
3.ఈ మధ్యకాలంలో చాలా మంది సులభంగా తయారు చేయగలుగుతున్నాం కదా అని ఫ్రోజెన్ ఫుడ్స్ ఎంచుకుంటున్నారు. కానీ... ఇవి కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ముఖ్యంగా గుండెకు ప్రమాదం తీసుకువస్తాయి.
4.ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింక్స్ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ... ఇవి కూడా పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ రావడానికి కూడా ఇవి కారణమౌతాయట. కాబట్టి వీటికి పిల్లలను దూరంగా ఉంచాలి.
5.ఇక పిల్లలకు ప్రతి ఒక్కరం బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి స్నాక్స్ లాగా ఇస్తూనే ఉంటాం. పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ.. వీటిని ఎక్కువగా తినకూడదట. పిల్లలలో ఒబేసిటీ, డయాబెటీస్ లాంటివి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట.
gummies
6.ఇక పండ్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని చాలా మంది తమ పిల్లలకు పండ్లతో చేసిన గమ్మీస్ ఇస్తూ ఉంటారు. కానీ.. నిజానికి వాటిలో ఎలాంటి న్యూట్రీషియల్ వాల్యూస్ ఉండవట. అంతేకాకుండా పిల్లలకు క్యావిటీస్ రావడానికి కారణమౌతాయి.
7.ఇక ఈ రోజుల్లో నూడిల్స్ ఇష్టపడని పిల్లలు అంటూ ఎవరూ ఉండరేమో. కానీ... వీటిని ఎక్కువగా తినడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురౌతుుంటారు. వీటిలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి అనార్యానికి కారణమౌతాయి.
french fries
8.ఫ్రెంచ్ ఫ్రైస్... చిన్న పిల్లలు సైతం వీటిని ఇష్టం గా తింటూ ఉంటారు. కానీ... ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. వీటిలో ఆరోగ్యానికి హాని చేసే ఫ్యాట్, షుగర్స్ యాడ్ చేస్తుంటారు. కాబట్టి వీటిని కూడా అస్సలు తినకూడదు.