మీ పిల్లల ప్రవర్తన ఇలా ఉందా...?
మీ పిల్లల ప్రవర్తన అంతా బాగానే ఉందో లేదో తెలుసుకోవడమెలా అనే సందేహం కలగొచ్చు. ఎందుకంటే... మన పిల్లల్లో లోపాలు మనకు పెద్దగా కనిపించకపోవచ్చు.
పిల్లల ప్రవర్తన సరిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం పిల్లలు అలా ఉండాలి... ఇలా ఉండాలి అని మనం చెబుతూనే ఉంటాం. అయితే... మీ పిల్లల ప్రవర్తన అంతా బాగానే ఉందో లేదో తెలుసుకోవడమెలా అనే సందేహం కలగొచ్చు. ఎందుకంటే... మన పిల్లల్లో లోపాలు మనకు పెద్దగా కనిపించకపోవచ్చు. అయితే... ఈ కింద సంకేతాలతో మీ పిల్లల ప్రవర్తన చాలా బాగుందని తెలుసుకోవచ్చట. అదెలాగో చూద్దాం...
1.మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం పిల్లలను పలకరించాలని... నమస్తే చెప్పమని చెబుతూ ఉంటారు. అయితే... మనం చెప్పకుండానే.. పిల్లలు అందరినీ పలకరిస్తున్నారంటే... వారి ప్రవర్తన చాలా బాగుందనే అర్థం.
2.ప్లీజ్, థాంక్యూ, సారీ అనేవి మ్యాజికల్ వర్డ్స్. వీటిని ఉపయోగిస్తూ.. దాని విలువ పిల్లలకు తెలిసింది అంటే వారి ప్రవర్తన సరిగా ఉన్నట్లే అర్థమట. ఎక్కడ ఏది వాడాలో.. తెలిసి వాటిని వాడుతున్నారంటే... వారు సరిగా పెరుగుతున్నట్లే అర్థం.
3.పెద్దలను గౌరవించడం చాలా మంచి అలవాటు. వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. ఈ అలవాటు కనుక మీ పిల్లల్లో ఉంది అంటే.... వారి ప్రవర్తన సరిగా ఉందనే అర్థం. అంటే... కేవలం ఇంట్లో వారిని మాత్రమే కాదు.. బయటి వారిని కూడా అంతే సమానంగా గౌరవిస్తున్నారంటే మీ పిల్లలు సరిగా పెరుగుతున్నారనే అర్థం.
4.వారికి ఏదైనా కావాలన్నా... ఏదైనా చేయాలన్నా అనుమతి తీసుకుంటున్నారంటే... వారు మంచి ప్రవర్తనతో పెరుగుతున్నట్లే అర్థం. వారు మీకు గౌరవం ఇస్తున్నారని అర్థం.
5.మంచి ప్రవర్తన తో పెరుగుతున్న పిల్లల్లో క్రమ శిక్షణ ఎక్కువగా ఉంటుంది. మీ పిల్లలు చక్కగా క్రమ శిక్షణతో పెరుగుతున్నారు అంటే... పేరెంట్స్ గా మీరు విజయం సాధించినట్లే.
6.మీ పిల్లలు చాలా సులభంగా ఇతరులతో స్నేహం చేస్తున్నారన్నా... ఇతర పిల్లలతో చాలా మంచిగా ఉంటున్నారన్నా... మీ పిల్లల ప్రవర్తన సరిగా ఉన్నట్లే అర్థం.
7.ఇంట్లో అన్ని పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయడం... ఇది నా పని కాదు అన్నట్లుగా ఉండకుండా.. వారికి తోచిన సహాయం చేస్తూ బాధ్యతగా ఉంటున్నారు అంటే... మీ పిల్లల ప్రవర్తన సరిగా ఉందనే అర్థం.
8.దాదాపు చాలా మంది పిల్లలు ఏ వస్తువును ఇతరులతో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ.. మీ పిల్లలు అలా కాకుండా షేరింగ్ ఈజ్ కేరింగ్ పాలసీని ఫాలో అవుతున్నారంటే మీ పిల్లల ప్రవర్తన సరిగా ఉందనే అర్థం. వారి బొమ్మలు, చాక్లెట్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నారంటే.. మీ పిల్లలు చాలా మంచి ప్రవర్తనతో ఉన్నట్లే అర్థం.