పిల్లల బ్రెయిన్ ని చురుకుగా చేసే ఫుడ్స్ ఇవి..!
కొన్ని రకాల ఫుడ్స్ ని పిల్లలకు తనిపించడం వల్ల.. వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుందని మీకు తెలుసా? మరి ఆ ఫుడ్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం..
brain food
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుల్లో, ఆటపాటల్లో అన్నింట్లోనూ ముందంజలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. తమ పిల్లల బుర్ర చాలా చురుకుగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఏవేవో కసరత్తులు వారు చేయడమే కాదు.. పిల్లలతోనూ చేయిస్తారు. అయితే.. ఎక్కువ తిప్పలు పడకుండా.. కొన్ని రకాల ఫుడ్స్ ని పిల్లలకు తనిపించడం వల్ల.. వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుందని మీకు తెలుసా? మరి ఆ ఫుడ్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం..
1.చేప..
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పెరుగులకు, చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్ లను పిల్లల ఆహారంలో భాగం చేయాలి. ఇలా చేయడం వల్ల.. అవి మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది.
2.బ్లూబెర్రీస్..
బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది. జ్నాపకశక్తి పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు.. ప్రతిరోజూ ఆహారంలో బ్లూ బెర్రీలను భాగం చేసుకుంటే.. మీ మెదడుకు వయసు పెరగదు. అంటే.. మతి మరుపు సమస్య రాదు.
3.బ్రోకలీ..
బ్రోకలీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా లభిస్తున్న కూరగాయ. దీనిని చాల రకాలుగా తీసుకోవచ్చు. సలాడ్ రూపంలో అయినా పిల్లలకు అందించవచ్చు. దీనిలోనూ యాంటీ ఆక్సీడెంట్స్ తోపాటు.. విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. మెదడు చురుకుగా పని చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
pumpkin seeds
4.గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజల్లో చాల రకాలు మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.బ్రెయిన్ ఆరోగ్యానికి సహాయడుతుంది. దీనిలో ఐరన్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
5.డార్క్ చాక్లెట్..
చాక్లెట్స్ ఇష్టపడని పిల్లలు ఎవరూ ఉండరు. అయితే.. వారు తినే నార్మల్ చాక్లెట్ కి బదులు..డార్క్ చాక్లెట్ ఇవ్వడం అలవాటు చేయండి. చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తినడం వల్ల.. పిల్లల బ్రెయిన్ చాలా చురుకుగా పని చేస్తుంది.
6.నట్స్..
నార్మల్ గా పేరెంట్స్ అందరూ తమ పిల్లలకు నట్స్ తినిపించాలని అనుకుంటారు. ఆ నట్స్ తినడం వల్ల.. కూడా బ్రెయిన్ చాలా చురుకుగా పని చేస్తుంది. పిల్లలు నట్స్ తినకపోతే.. పౌడర్ లా చేసి అయినా.. వేరే ఫుడ్స్ లో కలిపి తినిపించవచ్చు.
Egg