పిల్లలు అబద్ధం చెప్పినప్పుడు ఏం చేయాలి..?
పిల్లలు అఅలా అబద్దాలు చెబుతున్నట్లు పేరెంట్స్ గుర్తించినప్పుడు.. ఏం చేయాలి..? వారిని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం...
kids
పిల్లలు పుట్టినప్పటి నుంచి వారు ఎదిగే క్రమంలో మనం వారిలో చాలా మార్పులు చూస్తూ ఉంటాం. ఆ మార్పుల్లో ఒకటి.. అబద్ధాలు చెప్పడం. పిల్లలు.. ఒకానొక స్టేజ్ నుంచి అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. వారు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి.. లేదంటే... ఇతరులపై తోయడానికి ప్రయత్నించడానికి, చిన్నపాటి దొంగతనాలు చేసినప్పుడు.. పేరెంట్స్, టీజర్స్ ఏమైనా అంటారేమో అనే భయంతో వారు అబద్ధాలు చెబుతూ ఉంటారు. అయితే.. పిల్లలు అఅలా అబద్దాలు చెబుతున్నట్లు పేరెంట్స్ గుర్తించినప్పుడు.. ఏం చేయాలి..? వారిని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం...
నిజానికి పిల్లలు చిన్నపాటి అబద్ధాలు చెబతున్నారంటే.. నిజానికి వారికి తెలివి తేటలు ఎక్కువగా ళఉన్నాయని అర్థమట. కానీ.. ఆ అబద్ధాల రేంజ్ ఎంత వరకు ఉంది అనేది ఆలోచించాలి. వారు.. మరీ పెద్ద అబద్ధాలు చెప్పినప్పుడు మాత్రం.. కాస్త సీరియస్ గా తీసుకోవాలి.
anger kids
ఇక.. పిల్లలు అబద్ధం చెప్పారు అనగానే వారి మీద కోప్పడటం, కొట్టడం, తిట్టడం లాంటివి చేయకూడదు. కాస్త సున్నితంగా హ్యాండిల్ చేయాలి. తమకు తమ పిల్లల మీద చాలా నమ్మకం ఉందని.. ఆ నమ్మకం పాడుచేస్తున్నావు అని అది వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
మనం ఏం చేసినా.. నిజం చెప్పే ధైర్యం ఉండాలి అని... భయపడే వారే అబద్దం చెబుతారు అని పిల్లలకు చెప్పాలి. అప్పుడు.. పిల్లలు.. ప్రతి విషయానికీ అబద్ధం చెప్పే అలవాటును మార్చుకునే అవకాశం ఉంది.
పిల్లలు తప్పు చేసినప్పుడు మాత్రమే అబద్ధం చెబుతారు. తప్పు చేసినా పర్వాలేదని.. తప్పులు చేయడం సర్వ సాధారణం అని పేరెంట్స్ వారికి చెప్పాలి. తప్పు చేసినా.. ఒప్పుకోవాలని.. తప్పు నుంచి.. మరోసారి చేయకుండా నేర్చుకోవడం ముఖ్యం అనే విషయాన్ని వారికి చెప్పాలి.