పిల్లలకు హార్లిక్స్, బూస్ట్ కాదు.. ఈ హోం మేడ్ ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి..!
వీటిలో ఉండే పదార్థాలు పిల్లలకు పోషకాలు అందిస్తాయని నమ్ముతారు. కానీ.. అవి కూడా మంచివో కావో అనే సందేహం అయితే ఉంటూనే ఉంటుంది. మీకు అలా అనిపిస్తే.. ఇకపై వాటికి స్వస్తి పలకండి.
పిల్లల ఆరోగ్యం బాగుండాలనే ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. తమ పిల్లలకు అందించే ప్రతి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి ఎదుగుదల బాగుండాలని రెగ్యులర్ గా పాలు ఇస్తూ ఉంటారు. అయితే.. నార్మల్ పాలు పిల్లలు తాగడానికి ఇష్టపడరు కాబట్టి .. అందులో బూస్ట్, హార్లిక్స్ లాంటివి ఏవో ఒకటి కలిపి ఇస్తూ ఉంటారు. వీటిలో ఉండే పదార్థాలు పిల్లలకు పోషకాలు అందిస్తాయని నమ్ముతారు. కానీ.. అవి కూడా మంచివో కావో అనే సందేహం అయితే ఉంటూనే ఉంటుంది. మీకు అలా అనిపిస్తే.. ఇకపై వాటికి స్వస్తి పలకండి.
ఇంట్లోనే పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే.. ప్రోటీన్ పౌడర్ తయారు చేసి.. దానిని పాలల్లో కలిపి పిల్లలకు అందించండి. ఇది.. కచ్చితంగా మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగడానికి సహాయపడుతుంది. మరి.. ఈ హోం మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలి..? అది కూడా చాలా తక్కువ ధరలో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. శరీరం పెరుగుదల , నిర్వహణకు ప్రోటీన్ ఒక ముఖ్యమైన పోషకం. ముఖ్యంగా, ప్రోటీన్ కణాలు, కండరాలకు అవసరం, కానీ శరీర అవయవాలు, జుట్టు మరియు చర్మానికి కూడా ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ మనకు ఆహారంలో లభిస్తూనే ఉంటుంది. కానీ.. పిల్లలకు బూస్ట్ , హార్లిక్స్ రూపంలో.. పెద్దలు ప్రోటీన్ పౌడర్లు అంటూ మార్కెట్లో దొరికే వాటి వెంట పరిగెడుతూ ఉంటారు. వాటి వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అలా కాకుండా ఇంట్లోనే ఈ ప్రోటీన్ తయారు చేసుకోవచ్చు.
ఈ హోం మేడ్ ప్రోటీన్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
ఆపిల్ - పావు కిలో..
క్యారెట్ - పావు కిలో
బీట్‌రూట్ - పావు కిలో
చెక్కర. పావు కిలో
బెల్లం - పావు కిలో
బాదం - 100 గ్రా
పిస్తా - 100 గ్రా
ఏలకులు - 10
ABC juice
పద్ధతి:
ఇంట్లో ప్రొటీన్ పౌడర్ తయారు చేసేందుకు ముందుగా యాపిల్, క్యారెట్, బీట్‌రూట్‌లను శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని మంచిగా తురుముకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఓ బాణలిని ఓవెన్‌లో పెట్టి బాదం, పిస్తా, యాలకులు వేసి బాగా వేయించి మెత్తగా రుబ్బుకోవాలి.
దీని తరువాత, స్టవ్ వెలిగించి ఒక పాత్రను ఉంచి, దానికి రుబ్బిన పేస్ట్ వేసి బాగా వేయించాలి. తర్వాత దే చక్కెర బెల్లం పొడి వేసి బాగా కలపాలి. నీళ్లు వంపేసి చిక్కగా అయ్యాక అందులో బాదం, పిస్తా, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చపాతీ పిండి ఒక స్థిరమైన స్థితికి వచ్చాక, కాసేపు పక్కన ఉంచి, మళ్లీ కలుపుతూ ఉండాలి. ముద్దగా అయ్యాక పొయ్యి మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అది గట్టిగా అవుతుంది. అప్పుడు దానిని మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ప్రోటీన పౌడర్ రెడీ.
గాలి చొరబడని గాజు కంటైనర్‌లో దీన్ని ఉపయోగించండి. చెడిపోకుండా రెండు నెలల వరకు ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా దీనిని తాగొచ్చు.
మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ ప్రోటీన్ పౌడర్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు..
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది
స్కిన్ టోన్‌ని మెయింటెయిన్ చేస్తుంది
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
ఎముకల ఆరోగ్యానికి మంచిది