ఆడపిల్లలను ధైర్యంగా ఎలా పెంచాలి?
పిల్లలను ధైర్యంగా పెంచాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ రోజుల్లో పిల్లల పెంపకం చాలా సవాలుతో కూడుకున్న విషయం అనే చప్పాలి. ఆడపిల్ల అయినా, మగ పిల్లాడు అయినా బాధ్యతగా పెంచాలి. అయితే… అమ్మాయిలు ఎక్కువగా ప్రతి విషయంలోనూ భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడపిల్లలు భయకుండా, ధైర్యంగా నిలపడుతూ, తమను తాము ఎలా రక్షించుకోవాలో కచ్చితంగా నేర్పించాలి. మరి, పిల్లలను ధైర్యంగా పెంచాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
ఆడపిల్లలను పెంచే పద్ధతులు:
ఆడపిల్లల పెంపకంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. వారికి మార్గనిర్దేశం చేయాలి, మద్దతు ఇవ్వాలి. ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతుళ్లలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపేందుకు కొన్ని మార్గదర్శకాలను పాటించాలి.
రోల్ మోడల్‌గా ఉండటం:
బయటి ప్రపంచంలో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలా? ఇతరులతో గౌరవంగా ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? వారికి తెలిసిన రీతిలో ప్రవర్తించండి. చిన్న చిన్న విషయాల్లో ఆదర్శంగా నిలవడం వల్ల పిల్లలు పెద్దయ్యాక మంచి అలవాట్లను నేర్చుకుంటారు. ఇతరులకు రోల్ మోడల్ లా ఎలా ఉండాలో నేర్పించాలి.
దృఢంగా ఉండాలనే బోధన:
జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దృఢ సంకల్పంతో ఎలా ఎదుర్కోవాలో అమ్మాయిలకు నేర్పండి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు జరిగినా ధైర్యంగా పాల్గొనమని చెప్పండి. ఈ అలవాటు భవిష్యత్తులో వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
MS Dhoni with his daughter Ziva
ప్రశంసలు:
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా అందరికి పొగడ్తలు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల కోసం, వారి రూపాన్ని, దుస్తులను మాత్రమే పొగడకండి, వారు చేయగల చిన్న విషయాలకు వారిని అభినందించడానికి ప్రయత్నించండి.
కెపాసిటీ బిల్డింగ్:
జీవితంలో కొత్త సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అమ్మాయిలకు సహాయం చేయండి. మీరు దేనిలోనైనా విజయం సాధిస్తారని వారికి చెప్పండి. ఈ దయగల మాటలు వారిని ప్రదర్శించేందుకు ప్రేరేపించడంలో సహాయపడతాయి.