పిల్లల్ని తిట్టకుండా, కొట్టకుండా క్రమ శిక్షణలో పెట్టడం ఎలాగో తెలుసా?
పిల్లలు అల్లరి పనులు చేయడమే కాకుండా క్రమ శిక్షణ లేకుండా తయారవుతుంటారు. ఇలాంటప్పుడే తల్లిదండ్రులకు కోపం వచ్చి తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. వీటివల్ల పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని.

పేరెంటింగ్ టిప్స్
చాలా మంది పేరెంట్స్ తిట్టడం, కొట్టడం ద్వారానే పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని అనుకుంటారు. కానీ మీరు అరవడం వల్ల ఇంత కూడా యూజ్ లేదు. నిజానికి మీరు అరిచి పిల్లల్ని కొడితే వారు మరింత మొండిగా తయారవుతారు. భయం లేకుండా మరింత అల్లరి చేస్తుంటారు.
అందులోనూ మీరు ఇలా తిట్టడం వల్ల మీ పిల్లలకు మీరంటే నచ్చరు. అలాగే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే పిల్లలకు క్రమ శిక్షణను అలవర్చడానికి మీరు అరవడానికి బదులుగా కొన్ని పనులు చేయండి. దీనివల్ల మీ పిల్లలు అల్లరి మానుతారు. ఇందుకోసం పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాజిటివ్ అనే టెక్నిక్
మీ పిల్లలు చేసిన ప్రతి మంచి పనికి మెచ్చుకోవడం అలవాటు చేసుకోండి. అంటే టైంకి హోం వర్క్ కంప్లీట్ చేసినా, లేదా ఎవరికైనా సహాయం చేసినా, మీకు అబద్దాలు చెప్పకపోయినా వారిని ప్రశంసించండి. నువ్వు మంచి పని చేశావని వారితో అనండి. నిజానికి ఇవి చిన్న చిన్న మాటలే అయినా మీ పిల్లలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఇది వారిలో మంచి పనులు చేసేలా ప్రేరేపిస్తుంది. చెడు పనులకు దూరంగా ఉంచుతుంది. అందుకే పిల్లల్ని క్రమ శిక్షణలో పెట్టడానికి ఇది మీకు బాగా సహాయపడుతుంది.
బలవంతం చేయొద్దు
పిల్లలు ఒకరు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే వారు సొంతంగా అర్థం చేసుకునే టైం ఇవ్వండి. ఉదాహరణకు బయట చల్లగా ఉండి స్వెట్టర్ వేసుకోకపోతే వారిని బలవంతం చేయకండి. బయట చల్లగా ఉంది స్వెట్టర్ వేసుకుంటావో, లేదో ఆలోచించుకో అని ప్రేమగా చెప్పండి. ఇది పిల్లల్ని ఆలోచింపజేస్తుంది. ఇది వారి భవిష్యత్తుకు చాలా ముఖ్యం.
సృజనాత్మక కార్యకలాపాలు
మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని వారిపై అరవకండి. కోపగించుకోకండి. దీనికి బదులు వారిని సృజనాత్మక కార్యకలాపాల వైపు మళ్లించండి. అంటే డ్రాయింగ్ వేయించడం వంటి పనులను చేయించండి. ఇది మీ పిల్లల ప్రవర్తనను మంచిగా మారుస్తుంది. అలాగే వారు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. నెగిటీవ్ బిహేవియర్ నుంచి పాజిటీవ్ బిహేవియర్ కు మారేలా చేస్తుంది. అలాగే ఏది మంచి, ఏది చెడో అర్థం చేసుకుంటారు.
కారణం తెలుసుకోండి
మీ పిల్లలు ఎప్పుడూ తప్పులు చేస్తున్నట్టైతే వారిని ఒంటరిగా వదిలేయకండి. తిట్టకండి, కొట్టకండి. బదులుగా వారు తప్పులు చేయడానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడండి. దీనివల్ల పిల్లలు సేఫ్ గా ఫీలవుతారు. ఏదైనా సమస్య ఉంటే మీతో చెప్తారు. అంతేకాదు ఇది మీ పిల్లల ప్రవర్తనను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.