మగపిల్లలకు ప్రతి తల్లిదండ్రులు కచ్చితంగా నేర్పాల్సిన విషయాలు ఇవి....!
ఇద్దరూ సమానమే అనే విషయాన్ని వారికి నేర్పించాలి. శారీకంగా మాత్రమే బలంగా ఉంటారు అనే విషయాన్ని చెప్పాలి. ఆడ పిల్లలు కూడా మీతో పాటు ఈ సమాజంలో సమానమే అనే విషయాన్ని నేర్పించాలి.
పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల మనసులో చాలా ఉంటాయి. తమ పిల్లలు అన్ని విషయాల్లో బెస్ట్ గా ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు. అయితే.. ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలును అయితే ఒకలా.. అబ్బాయి అయితే... మరోలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ వ్యత్యాసం చూపించడాన్నిచాలా మంది పేరెంట్స్ సమర్థించకుంటారు.
ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇతరుల నుంచి రక్షించుకోవాలి అలాంటి విషయాలు చెబుతూ ఉంటారు. ఇక అబ్బాయిలు ఉంటే.... వంశాన్ని కాపాడాలి, తల్లిదండ్రులను పోషించాలి లాంటి విషయాలు చెబుతూ ఉంటారు. ఇవి కాకుండా.. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు కచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలట. అవేంటో ఓసారి చూద్దాం...
1.మీరు గమనించారో లేదో... చాలా మంది మగ పిల్లలు.. తాము మగవారు అయినందుకు చాలా గొప్పగా ఫీలౌతూ ఉంటారు. అది ఇంట్లో వారి తల్లిదండ్రుల ప్రవర్తన కూడా దానికి కారణం కావచ్చు. కాబట్టి.. పిల్లలకు మగ పిల్లలు మాత్రమే గొప్ప అనే విషయం చెప్పకూడదు. ఇద్దరూ సమానమే అనే విషయాన్ని వారికి నేర్పించాలి. శారీకంగా మాత్రమే బలంగా ఉంటారు అనే విషయాన్ని చెప్పాలి. ఆడ పిల్లలు కూడా మీతో పాటు ఈ సమాజంలో సమానమే అనే విషయాన్ని నేర్పించాలి.
2.మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరుల సహాయం ఎలా తీసుకుంటామో.. ఎదుటివారికి అవసరమైనప్పుడు మనం కూడా అదేవిధంగా సహాయం చేయాలి అనే విషయాన్ని మనం మగ పిల్లలకు నేర్పించాలి. ఇతరులకు సహాయం చేయడానికి బాధపడకండి. మీకు కూడా తెలియని వారికి కూడా సహాయం చేయాలి. ఎవరైనా రోడ్డు దాటడానికి సహాయం చేయడం లేదా సామాజిక కార్యకలాపంలో పాల్గొనడం వంటివి జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడతాయి అనే విషయాన్ని నేర్పించాలి.
3. చిన్నా, పెద్ద, లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్పించాలి. చిన్న వయసు వారి నుంచి కూడా మనం నేర్చుకునే విషయాలు ఉంటాయి అనే విషయాన్ని మనం పిల్లలకు చెప్పాలి.
4. కోపం ప్రతి ఒక్కరికీ వస్తుంది. కానీ... ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నవారే గొప్పవారు అవుతారు. చూపించాల్సిన సమయంలోనే కోపం చూపించాలి. అందిరపై చూపించకూడదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రశాంతంగా ఉండటం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే.. కోపం ఎక్కువగా ఉండేవారితో ప్రజలు అందరూ దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా ఉండేవారినే ప్రజలు ఎక్కువగా ప్రేమిస్తారు.
5.ఇతరులను ఎఫ్పుడూ తక్కువ చేయవద్దు. ఏ వ్యక్తిని కించపరిచే హక్కు నీకు లేదు. ఎల్లప్పుడూ తోటి మానవులతో కరుణ, దయతో వ్యవహరించండి. ఎవరైనా మీకు ఉన్నంత ప్రత్యేకత లేనప్పటికీ, మీరు వారికి గౌరవం చూపించాలి. ఎదుటివారిని ఏ విషయంలోనూ తక్కువ అని మీరు చూపించకూడదు.
6.సజ్జనులను అందరూ ఆరాధించడానికి ఒక కారణం ఉంది. సారీ, థ్యాంక్స్ , ప్లీజ్ వంటి ఆహ్లాదకరమైన పదాలు ఎప్పుడు, ఎక్కడ అవసరం అయినా చెప్పడం నేర్చుకోండి.పిరికి వ్యక్తిగా ఉండటం మంచిది కాదు. ధైర్యంగా ఉండాలి. అందరితోనూ మంచిగా ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్పాలి.