Parenting Tips: పిల్లలను ఈ విషయంలో అస్సలు బలవంత పెట్టకూడదు..!
మరీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని బలవంత పెట్టడం.. ఆంక్షలు పెట్టడం చేయవచ్చు. కానీ.. వయసు పెరిగినా.. పిల్లలపై ఆ ఆంక్షలు, ఒత్తిడి పెట్టకూడదు.
ప్రతి ఒక్క తల్లిదండ్రులు.. తెలిసో తెలియకో.. తమ పిల్లలపై కొన్ని రకాల ఒత్తిడి పెడుతూ ఉంటారు. అది మనకు కనీసం ఒత్తిడి అని కూడా తెలీదు. కానీ మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది. మనం దానిని ప్రేమ అని అనుకుంటూ ఉంటాం. కానీ.. అది పిల్లలకు తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతుందట.
మరీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని బలవంత పెట్టడం.. ఆంక్షలు పెట్టడం చేయవచ్చు. కానీ.. వయసు పెరిగినా.. పిల్లలపై ఆ ఆంక్షలు, ఒత్తిడి పెట్టకూడదు. ఎందుకంటే మనకు ఎక్కడ ఆపాలి అనే క్లారిటీ లేనప్పుడు అది పిల్లలకు సమస్యగా మారుతుంది. నిపుణుల ప్రకారం.. ఏ విషయంలో పిల్లలను బలవంత పెట్టకూడదో ఓసారి చూద్దాం..
1.పిల్లలు అబద్దాలు చెబితే.. తప్పు అని చెప్పడం సబబే. కానీ.. కొందరు తమ బడాయి కోసం పిల్లలతో బలవంతంగా అబద్దాలు చెప్పిస్తూ ఉంటారు. లేదంటే.. ఇంకొకరిలా చేయమని బలవంత పెడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి చిన్నదైనా సరే.. అబద్దం చెప్పమని మనం పిల్లలకు అస్సలు నేర్పిచకూడదు. ఇది వారికి భవిష్యత్తులో సమస్యగా మారే ప్రమాదం ఉంది.
2.పిల్లలు సరిగా భోజనం చేయరు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. పిల్లలకు సరైన పోషణ అందదనే భయంతో మనం ఎక్కువ తినాలని కోరుకుంటాం. అయితే... చాలా మంది పిల్లలకు ఆకలి లేదుు అని తెలిసినా.. బలవంతంగా తినిపించాలని చూడటం లాంటివి చేయకూడదట. వారికి ఆకలి అయినంత వరకే తినిపించాలి.
parent's day
3.కొందరు తల్లిదండ్రులు.. తమ పిల్లలను ఇతరులకు హగ్ ఇవ్వమని, కిస్ ఇవ్వమని బలవంత పెడుతూ ఉంటారు. వారు ఇష్టంగా చేస్తే పర్లేదు. కానీ.. అలా చేయమని వీరు వారిని బలవంత పెట్టడం అస్సలు చేయకూడదటు. మరీ ముఖ్యంగా కొత్తవారికి ముద్దు పెట్టమని, హగ్ ఇవ్వమని అస్సలు బలవంత పెట్టకూడదు. వారికంటూ ఈ విషయంలో స్పేస్ ఇవ్వాలి.
4.పిల్లలు తప్పు చేస్తే మందలించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అలా కాకుండా.. మీ పిల్లలది తప్పు కాకపోయినా.. ఎదుటివారి చేత క్షమాపణలు చెప్పించడం లాంటివి చేయకూడదు. మీ పిల్లల తప్పు ఉంటే చెప్పించడంలో తప్పులేదు . కానీ.. తప్పు లేకుండా క్షమాపణలు చెప్పించాలనుుకోవడం మాత్రం చాలా పెదద్ తప్పు.
5.పిల్లలు కడుపు నిండా తినే ఛాన్స్ ఇవ్వాలి. అలా కాకుండా.. చాలా మంది.. తమ పిల్లలను ఎక్కువగా తినొద్దు.. నువ్వు డైటింగ్ చేయాలి లాంటివి చప్పకూడదు. ఆరోగ్యానికి హానికరమైన ఆహారం తింటుంటే తినొద్దు అని చెప్పడంలో తప్పులేదు కానీ.. పిల్లలను డైట్ చేయమని బలవంత పెట్టకూడదు.