పిల్లల విషయంలో ఈ తప్పులు చేయకండి....!
తమ ఫీలింగ్స్ ని పట్టించుకోరు అనే బాధ వారిలో పెరిగిపోతుంది. అంతేకాదు.. ప్రతి విషయంలో మీరు వారిని ప్రోత్సహించడం లేదని.. నిరుత్సాహ పరుస్తున్నారనే భావన కలుగుతుంది.
ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి విషయంలోనూ ఉన్నతంగా ఉంచాలని కోరుకుంటారు. తమ పిల్లలు అన్నింట్లోనూ ఫస్ట్ రావాలని కోరుకుంటారు. ఈ క్రమంలో మనం తెలిసో తెలియకో చేసే కొన్ని పనులు.. పిల్లల భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయట. మరి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో ఓసారి చూద్దాం..
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏప్పుడు ఏం చేయాలో వారే డిసైడ్ చేస్తారు. పిల్లల ఎమోషన్స్ , ఫీలింగ్స్ పట్టించుకోరు. దీని వల్ల కొందరు పిల్లలు వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ కొందరు పిల్లలు వెంటనే రియాక్ట్ అవ్వరు. కాకపోతే... తమ తల్లిదండ్రులకు దూరమైపోతారు. తమ ఫీలింగ్స్ ని పట్టించుకోరు అనే బాధ వారిలో పెరిగిపోతుంది. అంతేకాదు.. ప్రతి విషయంలో మీరు వారిని ప్రోత్సహించడం లేదని.. నిరుత్సాహ పరుస్తున్నారనే భావన కలుగుతుంది.
పిల్లలకు వారి తల్లిదండ్రులు పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలట. ప్రతిదీ మనకు నచ్చినట్లు వారిపై రుద్దకూడదు. కనీసం.. మన పిల్లలకు మనం నేను చెయ్యను, నాకు ఇది వద్దూ అని చెప్పుకునే స్వాతంత్రం ఇవ్వాలట. అలా మనం ఇవ్వకపోతే.. వారు ప్రతి విషయంలోనూ పైకి ఎదగలేరు. గట్టిగా సమాధానం చెప్పాల్సిన చోట కూడా వారు నోరు విప్పరట. అందరినీ బతిమిలాడుకునేలాగానే వారు మిగిలిపోతారు.
parent's day
మన పిల్లలకు పోషకాహారం తినిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ... వారికి నచ్చని ఆహారాన్ని బలవంతంగా తినిపించాలని అనుకోకూడదట. దానికి బదులు.. ఆ ఆహారాన్ని, సరైన పోషకాలకు వారికి అందించడానికి ఎలా చేస్తే.. వారికి నచ్చుతుంది అనే విషయాన్ని ఆలోచించాలి. అంతేకాకుండా.. రోజూ హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలి అని చెప్పడం కరక్టే కానీ... అప్పుడప్పుడు అయినా చీట్ మీల్స్ తినడానికి అనుమతి ఇవ్వాలి.
చాలా మంది పేరెంట్స్ పిల్లలు తప్పులు చేసే శిక్షిస్తారు. అయితే... ఆ శిక్ష అప్పటికి మాత్రమే అమలు అయ్యేలా ఉండాలి. కానీ.. జీవితాంతం ఉండేలా చేయకూడదు. దాని వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అంతేకాకుండా వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ఇక కొందరు తల్లిదండ్రులు పిల్లలకు చదువు మాత్రమే కీలకం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. పిల్లలకు మార్కులు తగ్గితే తెగ బెంగపడతారు. ఈ విషయంలో వారిపై ఒత్తిడి తెస్తారు. కానీ.. అలా చేయకూడదట. పిల్లలకు చదువు రాకపోతే.. వారికి ఆసక్తి ఉన్న వేరేది నేర్పించే ప్రయత్నం చేయాలి. చదువు మాత్రమే జీవితం కాదు.. పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడే వి చాలానే ఉన్నాయి. వాటిని నేర్పించవచ్చు.
ఇక చాలా మంది పేరెంట్స్ చేసే అతి పెద్ద మిస్టేక్ ఇది. ప్రతి విషయంలో పిల్లలను వేరే వారితో పోలుస్తూ ఉంటారు. అలా పోల్చడం చాలా పెద్ద తప్పు. దీని వల్ల పిల్లలో వారిపై కోపం పెరుగుతుంది. వారి ఎదుగుదలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది.