MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • మీ పిల్లలకు అబద్ధాలు చెప్తరా? ఇలా చేస్తే ఏమౌతుందో తెలుసా?

మీ పిల్లలకు అబద్ధాలు చెప్తరా? ఇలా చేస్తే ఏమౌతుందో తెలుసా?

పిల్లలు తల్లిదండ్రులను ఎంతగానో నమ్ముతారు. ఎంతలా అంటే తల్లిదండ్రులు చెప్పిన విషయమే నిజం.. అవతలి వారు చెప్పేది అబద్దం అనేంతలా. అందుకే పిల్లలతో ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో అబద్దాలు చెప్తుంటారు. కానీ దీనివల్ల పిల్లలు ఎలా తయారవుతారో తెలుసా. 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Jan 09 2024, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పిల్లల ఎదుగుదలపై ప్రభావం

పిల్లలకు అన్నీ నిజాలే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇవి పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నమ్ముతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి హాని చేయని అబద్దాలను చెప్పేస్తుంటారు. వీటివల్ల పెద్దగా నష్టపోయేదేమీ లేదని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ హానిచేయని ఈ అబద్ధాలు పిల్లల భావోద్వేగ, మానసిక ఎదుగుదలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తల్లిదండ్రులు-పిల్లల సంబంధాలపై నమ్మకం సన్నగిల్లుతుంది

పిల్లలు తమ తల్లిదండ్రులను పిల్లలు బాగా నమ్ముతారు. ఎందుకంటే ఎప్పుడూ తల్లిదండ్రులే పిల్లలతోనే ఉంటారు. వారికి లోకం పోకడ  గురించి చెప్తారు. జ్ఞానం, మార్గదర్శకత్వం చేస్తారు. అందుకే మా అమ్మానాన్నలు చెప్పేది నిజమని నమ్ముతారు. కానీ పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ వారి తల్లిదండ్రులు చెప్పింది నిజాలు కాదని తెలిసిపోతుంది. దీనివల్ల నిజాయితీగా లేని తల్లిదండ్రులపై పిల్లలకు నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్నవయసులోనే పిల్లలతో నమ్మకం అనే పునాదిని ఏర్పాటు చేయడానికి ఎక్కువ విలునివ్వాలి. ఇదే వారు మీ నుంచి నేర్చుకుంటారు. కానీ ఎప్పుడూ ఎప్పుడూ అబద్దాలు చెప్పుకుంటూ పోతే ఈ ఈ పునాది దెబ్బతింటుంది. అలాగే పిల్లలు పెద్దయ్యాక కమ్యూనికేషన్ సమస్యలు, సంబంధాలు దెబ్బతింటాయి.
 

35

చిన్న చిన్న అబద్ధాల ప్రభావం

చిన్న అబద్ధాలు పెద్దగా ఎఫెక్ట్ చూపించవు అని అనిపించనప్పటికీ.. ఇవి ఒక పిల్లవాడు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడనే దానిపై పెద్ద ప్రభావాన్నే చూపుతాయంటారు నిపుణులు. ఉదాహరణకు.. శాంటాక్లాజ్ తాత వచ్చి క్రిస్మస్ రోజున గిఫ్ట్ లు ఇస్తారని చెప్తుంటారు. కానీ ఆ రోజు శాంటాక్లాజ్ తాత రాక.. వారికి గిఫ్ట్ లు ఇవ్వకపోవడంతో వారు నిరుత్సాహానికి గురవుతారు. అలాగే ఈ మాటలు చెప్పిన తల్లిదండ్రులను కూడా పిల్లవాడు నమ్మకుండా మారుతాడు. అంటే మీరు చెప్పిన ప్రతి విషయం అబద్దాలే అని అనుకునే అవకాశం ఉంది. అందుకే పిల్లలకు ఆశలను కలిగించే అబద్దాలను తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడూ చెప్పకూడదు.

45

నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్

పిల్లలతో నిజాయితీగా మాట్లాడటం వల్ల వారు మిమ్మల్ని నమ్ముతారు. అలాగే నైతిక ప్రవర్తన కూడా బాగుంటుంది.  నిజాయతీని మోడలింగ్ చేసే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. చేసే పనులు, నిర్ణయాల గురించి నిజాయితీగా ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలలో సమగ్రత భావాన్ని పెంపొందించవచ్చు. సమస్య పరిష్కారం,నిర్ణయం తీసుకోవడానికి ఆరోగ్యకరమైన విధానాన్ని క్రియేట్ చేయొచ్చు. 
 

55

కమ్యూనికేషన్, అవగాహనను ప్రోత్సహించడం

తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అలాగే ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలను పిల్లలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడానికి ప్రోత్సహించాలి. పిల్లలను ప్రశ్నలు అడగాలి. వారికి నిర్మొహమాటమైన, వయస్సుకు తగినట్టుగా ప్రతిస్పందిస్తే మీరు నమ్మకానికి పునాది వేయొచ్చు. పిల్లలు చేసే మంచి పనులకు అభినందించండి. అలాగే వారి ఆలోచనలు, ఆందోళనలను పంచుకోవడానికి వారు సౌకర్యవంతంగా భావించే వాతావరణాన్ని సృష్టించడానికి వారి భావోద్వేగాలను గుర్తించండి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved