ఫస్ట్ బేబీ విషయంలో ప్రతి తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే..!
జ్వరం వచ్చిందా.. ఏదైనా దెబ్బ తగిలిందా..? ఏదైనా ర్యాష్ వచ్చిందా ఇలా అన్నీ పరిశీలించి ఆ తర్వాత దానికి తగిన చికిత్స చేయించాలి. అంతేకానీ.. ముందుగానే కంగారు పడకూడదు. ప్రశాంతంగా ఉండాలి.
cat babysitting infant
తల్లిదండ్రులు గా మారడం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మొదటి సారి తల్లిదండ్రులుగా మారినప్పుడు ఆ ఫీలింగ్ మరింత స్పెషల్ గా ఉంటుంది. తమ బిడ్డను చాలా అపురూపంగా చూసుకుంటారు. చిన్న దెబ్బ కూడా తగలకూడదని, ఎలాంటి ప్రాబ్లం రాకూడదని... ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే... ఈ క్రమంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారట. ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దాం...
మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లికి చాలా ఒత్తిడిగా ఉంటుందట. తల్లిగా మారిన తర్వాత బిడ్డకు పాలివ్వడం తల్లి బాధ్యత. ఈ విషయంలో తల్లి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... బిడ్డకు తల్లి కచ్చితంగా 6 నెలల పాటు పాలు ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలకు తల్లిపాలు మాత్రమే పోషకాలు అందిస్తాయి అనే విషయం గుర్తుంచుకోవాలి.
మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లికి చాలా ఒత్తిడిగా ఉంటుందట. తల్లిగా మారిన తర్వాత బిడ్డకు పాలివ్వడం తల్లి బాధ్యత. ఈ విషయంలో తల్లి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... బిడ్డకు తల్లి కచ్చితంగా 6 నెలల పాటు పాలు ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలకు తల్లిపాలు మాత్రమే పోషకాలు అందిస్తాయి అనే విషయం గుర్తుంచుకోవాలి.
ఇక రెండోది.. మొదటి సారి తల్లిదండ్రులుగా మారినవారు.. బిడ్డ ఏడుపు వింటే చాలు కంగారుపడిపోతారు. బిడ్డ ఏడ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అంతేకానీ.. ఏడుపు వినపడగానే వెంటనే కంగారు పడకూడదు. బిడ్డ ఎందుకు ఏడుస్తుందో గమనించాలి. జ్వరం వచ్చిందా.. ఏదైనా దెబ్బ తగిలిందా..? ఏదైనా ర్యాష్ వచ్చిందా ఇలా అన్నీ పరిశీలించి ఆ తర్వాత దానికి తగిన చికిత్స చేయించాలి. అంతేకానీ.. ముందుగానే కంగారు పడకూడదు. ప్రశాంతంగా ఉండాలి.
చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డ విషయంలో అతి జాగ్రత్తలు చూపిస్తూ ఉంటారు. బిడ్డ నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పడకూడదని చాలా చేస్తూ ఉంటారు. అయితే.. మరీ అతి చేయకూడదట. కొన్నిసార్లు అతిగా చేయడం వల్ల బిడ్డకు ఊపిరాడకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. కింద పడకుండా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అంతేకానీ... వారి చుట్టూ కంచెలాగా వస్తువులు పేర్చుకుంటూ పోకూడదు.
ఇక చాలా మంది తల్లిదండ్రులు.. బిడ్డ పుట్టిన ఆనందంలో... అవసరం లేని వస్తువులను కూడా కొనేస్తూ ఉంటారు. పిల్లల వయసు అర్థం చేసుకోకుండా... ఏవేవో బొమ్మలు కొనేస్తూ ఉంటారు. వారు ఎలా ఆడుకుంటారు అనేది కూడా గమనించరు. డబ్బులు వేలకు వేలు పోసి కొనేస్తూ ఉంటారు.
తమ చిన్నారి ని అందరికీ చూపించాలనే ఆతురతతో బయటకు తీసుకువెళుతూ ఉంటారు. జనాలు ఎక్కువ ఉన్న ప్రదేశానికి కూడా తీసుకువెళుతూ ఉంటారు. పిల్లలను జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవడం అంటే.... వాళ్ల ఆరోగ్యాన్ని ఇబ్బందిలో పడేయం కాదు. చంటి పిల్లలకు బయటకు తిప్పకూడదు. వాళ్లకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.