Silver Jewelry : వెండి పట్టీలు తెల్లగా కావాలంటే ఇలా చేయండి
Silver Jewelry : వెండి పట్టీలతో పాటుగా వెండి ఆభరణాలు ఏవైనా సరే కొన్ని రోజులకు నల్లగా అయిపోయి పాతవాటిలా కనిపిస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వెండి ఆభరణాలను తెల్లగా, కొత్తవాటిలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

వెండి నగలను క్లీన్ చేసే చిట్కాలు
వెండి నగలను ఎప్పుడూ వాడటం వల్ల వాటి మెరుపు తగ్గుతుంది. నగలు నల్లగా అవుతాయి. ఆడవారు ఎక్కువగా వాడే వెండి నగలు కాలక్రమేణా అవి పాతవాటిలా కనిపిస్తుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో పాతబడిన, నల్లబడిన వెండినగలను తిరిగికొత్తవాటిలా తెల్లగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మరసం
నిమ్మరసంతో వెండి నగలను తిరిగి కొత్తవాటిలా చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో కొంచెం నిమ్మరసం వేసి అందులో మూడు టీస్పూన్ల రాతిఉప్పు వేసి బాగా కలపండి. ఈ నీళ్లలో వెండి నగలను 5 నిమిషాలు నానబెట్టండి. తర్వాత నీట్ గా ఉండే గుడ్డతో తుడిస్తే వెండి కొత్తదానిలా మెరిసిపోతుంది.
కెచప్
ఆశ్యర్యపోయినా కెచప్ పో కూడా వెండి నగలను, వస్తువులను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక పేపర్ పై కెచప్ వేసి దానితో వెండి నగలను తుడవండి. ఈ కెచప్ వెండికి 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఇలా చేస్తే నల్లబడిన వెండి నగలు తెల్లగా అవుతాయి.
టూత్ పేస్ట్
టూత్ పేస్ట్ తో కూడా వెండిని శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం కొంచెం టూత్ పేస్ట్ ను తీసుకుని వెండి నగలకు రాయండి. 6 నిమిషాల తర్వాత చల్లనీళ్లతో కడిగితే సరిపోతుంది.
బేకింగ్ సోడా, వెనిగర్
బేకింగ్ సోడా, వెనిగర్ తో కూడా వెండి నగలను, వస్తువులను శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం వేడి నీళ్లలో సగం కప్పు వెనిగర్, రెండు చెంచాల బేకింగ్ సోడాను వేసి కలపండి. దీనిలో వెండి నగలను, వస్తువులను 2 గంటల పాటు నానబెట్టండి. తర్వాత శుభ్రమైన క్లాత్ తో తుడవండి. దీనితో అవి కొత్తవాటిలా కనిపిస్తాయి.
డిటర్జెంట్ పౌడర్
డిటర్జెంట్ పౌడర్ తో కూడా వెండి నగలను కొత్తవాటిలా చేయొచ్చు. ఇందుకోసం కొన్ని వేడినీళ్లలో డిటర్జెంట్ పౌడర్ ను వేసి అందులో వెండి నగలను, వస్తువులను వేసి 5 నిమిషాలు నాననివ్వండి. తర్వాత శుభ్రమైన క్లాత్ తో తుడిస్తే కొత్తవాటిలా కనిపిస్తాయి.