- Home
- Life
- Pregnancy & Parenting
- పిల్లలు ఫోన్‌లో BAD VIDEOS చూడకూడదంటే.. చిన్న సెట్టింగ్ మార్చండి చాలు
పిల్లలు ఫోన్‌లో BAD VIDEOS చూడకూడదంటే.. చిన్న సెట్టింగ్ మార్చండి చాలు
ఈ కాలంలో ఫోన్ చూడని పిల్లలు ఎవరుంటారు చెప్పండి. వారికి ఫోన్ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ప్రాజెక్ట్ వర్క్ ఉందని, ఆన్ లైన్ క్లాసెస్ వినాలని పిల్లలు ఫోన్ తీసుకుంటారు. కాని వారు BAD VIDEOS చూస్తుంటే..? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

ప్రస్తుతం కాలంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు తమతో లేకపోయినా ఉండగలరు. ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ పక్కన లేకపోయినా హ్యాపీగానే ఉంటారు. కాని స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ఉండలేకపోతున్నారు. ఇదేం వాళ్ల తప్పు కాదు. మారిన కాలం అలా ఉంది. ప్రైమరీ స్కూల్ చదివే పిల్లలు కూడా రకరకాల ప్రాజెక్ట్స్ చేయాల్సి వస్తోంది. మరి వారికి స్మార్ట్ ఫోన్ ఇవ్వకుండా ఎలా ఉంటాం. చిన్న పిల్లల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక హైస్కూల్, కాలేజీలు చదివే పిల్లల గురించి ప్రత్యేకంగా ఏం చెబుతాం. పక్కన ఎవరున్నా లేకపోయినా చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ ఉండి తీరాల్సిందే.
ఇప్పుడే ఇలా ఉందంటే.. భవిష్యత్తులో మరింత ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే పరిస్థితులు రానున్నాయి. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించుకొనే భవిష్యత్తులో తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే పిల్లల చేతికి ట్యాబ్ లు వచ్చేశాయి. రకరకాల ప్రాజెక్టుల పేరుతో పిల్లలు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లో బ్రౌజింగ్ చేస్తూ ఉండటం, కంప్యూటర్ ముందు గంటల తరబడి వర్క్ చేయాల్సి రావడం చేయాల్సి వస్తోంది. దీంతో భవిష్యత్తులో తరగతులన్నీ ఆన్ లైన్ లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చాలా మంది తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా చేస్తున్న పనేంటంటే.. పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం. ఆడుకోమని పంపిస్తే దెబ్బలు తగిలించుకుంటారు. ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలా అని వారిని దగ్గరుండి ఆడించడానికి తల్లిదండ్రులు ఇద్దరూ వర్క్ బిజీలో ఉంటారు. దీంతో గత్యంతరం లేక పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నారు.
అయితే వారి ఫోన్ ఇచ్చేసి మన పని మనం చూసుకుంటూ ఉంటే.. మధ్యలో వచ్చే అసభ్యకరమైన యాడ్స్, సినిమా పాటలు, డాన్సులు, సన్నివేశాలు వారికి లేనిపోని ఆలోచనలు కలిగిస్తాయి. బూతు డైలాగులు చెప్పడం, వల్గర్ గా ఉండే స్టెప్స్ వేయడం ఏం తప్పు కాదన్న భావనలోకి పిల్లలు వెళ్లిపోతారు.
ఒకవేళ అలాంటి వాటిని మీ పిల్లలు చూస్తున్నారని మీకు తెలిసి వాళ్లని హెచ్చరిస్తే ఇక అంతే సంగతులు. మీరు లేనప్పుడు వారు కచ్చితంగా అలాంటి వాటినే చూస్తారు. పిల్లలు ఏది చేయొద్దంటే అదే చేస్తారని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలా కాకుండా పిల్లలకు చేయకూడని పనులు చెప్పి, వాటిని ఎందుకు చేయకూడదో వివరిస్తే చక్కగా పాటిస్తారు.
అసలు పిల్లలకు ఇచ్చే స్మార్ట్ ఫోన్ లో బ్యాడ్ వీడియోస్ రాకుండా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా. మీ ఫోన్ లో చిన్న సెట్టింగ్ మారిస్తే పిల్లలు స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు అసభ్యకర కంటెంట్ రాకుండా ఉంటుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు పిల్లలకు ఇచ్చే స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేయండి.
సెట్టింగ్స్ పై క్లిక్ చేసి ‘జనరల్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి
తర్వాత కనిపిస్తున్న ఆప్షన్ లో ‘రెస్ట్రిక్టెడ్ మోడ్’ ను ఆన్ లో ఉంచుకోండి.
దీంతో మీ పిల్లలు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు 18 ప్లస్ కంటెంట్, వల్గర్ వీడియోస్, అసభ్యకర ఫోటోలు, వీడియోలు రాకుండా ఉంటాయి.
‘ఫేస్ బుక్’, ఇన్ స్టా గ్రమ్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ని పిల్లలు ఓపెన్ చేయకుండా లాక్ చేసి ఉంచడం చాలా బెటర్.