MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • జ్ఞాపకశక్తి పెరగడానికి పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ పెట్టాలో తెలుసా?

జ్ఞాపకశక్తి పెరగడానికి పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ పెట్టాలో తెలుసా?

స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఇంకేంటి పిల్లలు చదువులు, హోం వర్క్, ఎక్సామ్స్ తో ఫుల్ బిజీగా ఉంటారు. అయితే చాలా మంది పిల్లలు టీచర్ చెప్పిన లెసన్స్ ను లేదా విషయాలను మర్చిపోతుంటారు. అయితే మీ పిల్లలకు కొన్ని రకాల ఆహారాలను పెడితే వారి మెమోరీ పవర్ పెరిగి.. ఎలాంటి విషయాన్ని మర్చిపోరు. అవేంటంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 13 2024, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొంతమంది మంది పిల్లలు ఎంత చదివినా, రాసినా.. నేర్చుకున్న విషయాన్ని చాలా త్వరగా మర్చిపోతుంటారు. అడిగితే గుర్తుకు లేదని చెప్తుంటారు. కానీ ఇది పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. చదువులో వెనకబడేలా చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కొన్ని రకాల ఆహారాలు బాగా సహాయపడతాయి. ఇవి మీ పిల్లల ఏకాగ్రతను కూడా పెంచుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Kids food

Kids food

పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు...

ఆకుకూరలు

ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్, ఫోలేట్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి, మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయి. ఫోలేట్ కలిగిన ఆకుకూరలు పిల్లల మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

37

 గుడ్డు

గుడ్లు మంచి పోషకాహారం. ఇది మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్డు పచ్చసొన కోలిన్ కు మంచి వనరు. గుడ్లలో విటమిన్ బి 6, విటమిన్ బి 12, ఫోలేట్, కోలిన్ తో  పాటుగా మెదడును ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

47
kids foods

kids foods

చేపలు

చేపలు మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా మంచి కొవ్వులున్న చేపలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సార్డినెస్, మాకేరెల్, సాల్మన్ వంటి చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ చేపల్లో ఇపిఎ, డిహెచ్ఎ వంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. 
 

57

వేరుశెనగ

వేరుశెనగ కూడా పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ ఇ నరాలను రక్షిస్తుంది. మెదడు పనితీరుకు అవసరమైన థయామిన్ కూడా వేరుశెనల్లో మెండుగా ఉంటుంది. 

67

ధాన్యాలు

తృణధాన్యాల్లో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా వీటిలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ బి పిల్లల్లో శ్రద్ధ, ఏకాగ్రతను పెంచుతుంది.

77

ఓట్స్ 

ఓట్స్ పెద్దలకే కాదు పిల్లలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది. ఓట్స్ శరీరానికి, మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తుంది. అలాగే పిల్లలను మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఓట్స్ పిల్లల కడుపు నింపడమే కాకుండా వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved