MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • ప్రెగ్నెన్సీ టైంలో కాళ్లు, చేతులు ఎందుకు ఉబ్బుతాయి?

ప్రెగ్నెన్సీ టైంలో కాళ్లు, చేతులు ఎందుకు ఉబ్బుతాయి?

ప్రెగ్నీన్సీ సమయంలో ప్రతి ఒక్కరి కాళ్లు, చేతులు వాపు ఉబ్బు వస్తాయి. ఈ సమయంలో ఇలా అవ్వడం కామన్ అని చాలా మంది అంటుంటారు. అసలు ఇలా ఎందుకు అవుతుంది? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 02 2024, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రగ్నెన్సీ టైంలో ఆడవాళ్ల శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు వస్తాయి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ టైంలో చాలా మంది ఆడవారికి తలనొప్పి, వాంతులు, మైకము, ఊబకాయం, ముఖంపై మొటిమలు, చేతులు, కాళ్ల వాపులు వస్తుంటాయి.  ప్రెగ్నెన్సీ సమయంలో పాదాల వాపు అనేది సర్వ సాధారణ సమస్య. దీన్ని వైద్య భాషలో ఎడెమా అంటారు. అయితే ఈ వాపు చేతులు, ముఖంపై కనిపిస్తే ఇది ప్రీక్లాంప్సియాకు సంకేతంగా భావిస్తారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
swollen feet

swollen feet

ఎడెమా అంటే ఏంటి?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రెగ్నెన్సీ టైంలో పాదాల వాపు అనేది ఒక సాధారణ సమస్య.  కడుపులో పెరుగుతున్న బిడ్డ అవసరాలను తీర్చడానికి శరీరం ఉత్పత్తి చేసే అదనపు రక్తం, ద్రవం కారణంగా కాళ్లు, చేతులు వాపు వస్తాయి.  దీన్నే వైద్య భాషలో ఎడెమా అంటారు. ఈ కారణంగా పాదాలలో మాత్రమే కాకుండా చేతులు, ముఖంతో పాటు శరీరంలోని కొన్ని భాగాలు వాపు వస్తాయి. 
 

37
swollen foot

swollen foot


ప్రెగ్నెన్సీ టైంలో పాదాల వాపునకు కారణమేంటి?

హార్మోన్ల మార్పులు 

ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారి శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్, హెచ్సిజి, ప్రోలాక్టిన్ వంటి ఎన్నో హార్మోన్ల లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. దీని వల్ల ఎడెమా వస్తుంది. 

బరువు పెరగడం

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు బరువు బాగా పెరిగిపోతారు. అయితే ఈ సమయంలో బరువు పెరగడం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

47

హిమోగ్లోబిన్ లోపం

గర్భధారణ సమయంలో ఆడవాళ్ల శరీరంలో ప్రోటీన్, హిమోగ్లోబిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా పాదాల వాపు సమస్య వస్తుంది. అయితే డెలివరీ తర్వాత పాదాలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి.
 

57

పాదాల వాపును తగ్గించే చిట్కాలు

పాదాలను దిండుపై ఉంచడం

ప్రెగ్నెన్సీ సమయంలో ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం వల్ల పాదాలలో వాపు వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు పాదాలకు విశ్రాంతినివ్వడానికి మంచంపై ఒక దిండును ఉంచి దాని పైన మీ పాదాలతో 20 నిమిషాల పాటు పెట్టి పడుకోండి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయడం వల్ల పాదాల వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 

67
pregnancy

pregnancy

ఎప్సమ్ ఉప్పు నీరు

పాదాలలో వాపు అనిపిస్తే నీళ్లలో ఎప్సమ్ ఉప్పును వేసి అందులో మీ పాదాలను పెట్టండి. ఎప్సమ్ ఉప్పులో ఉండే లక్షణాలు పాదాల కండరాలను కుదించి నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ రెమెడీ చేయడానికి, ఒక పెద్ద బకెట్ లో వేడి నీటిని తీసుకొని దానిలో ఒక టీస్పూన్ ఎప్సమ్ ఉప్పును కలపండి. ఇప్పుడు ఈ నీటిలో మీ పాదాలను 20 నుంచి 25 నిమిషాల పాటు నానబెట్టండి.
 

77

పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం

ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో పొటాషియం లేకపోవడం కూడా పాదాల వాపు వస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు, నీరు నిలుపుదల సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ సమస్యను తగ్గించడానికి పొటాషియం ఎక్కువగా ఉండే బంగాళాదుంపలు, అరటిపండ్లు, దానిమ్మ, పిస్తా, చిలగడదుంపలు వంటి వాటిని మీ రోజువారి ఆహారంలో చేర్చండి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే తల్లిదండ్రులు ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే
Recommended image2
Parenting: పిల్లలు పేరెంట్స్ దగ్గర సీక్రెట్స్ ఎందుకు దాస్తారో తెలుసా?
Recommended image3
Parenting: పిల్లలు బుద్ధిగా మీ మాట వినాలంటే ..ఈ సూత్రాలు ఫాలో అయిపోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved