పిల్లల ముందే గొడవలు...తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఇదే...!
తమ తల్లిదండ్రులు ప్రేమగా ఉంటే పిల్లలు ఆనందంగా ఉంటారట. అలా కాకుండా.. పిల్లలు తరచూ గొడవలు పడుతూ ఉంటే.. పిల్లల మనసు అంత ఆహ్లాదంగా ఉండకపోవచ్చట.
couple fight
దంపతుల మధ్య వాదనలు, తగాదాలు జరగడం చాలా సహజం. మనం ఎంత ప్రయత్నించినా దాని నుంచి మనం తప్పించుకోలేం. గొడవలు జరగని దంపతులు ఉండటం చాలా అరుదు అనే చెప్పాలి. కానీ.. ఈ గొడవలు మీరు మీ పిల్లల ముందు పడుతున్నారా..? పిల్లల ముందు గొడవలు పడే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయంలో పేరెంట్స్ ఏం చేయాలో.. ఏం చేయకూడదో దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం...
తమ తల్లిదండ్రులు ప్రేమగా ఉంటే పిల్లలు ఆనందంగా ఉంటారట. అలా కాకుండా.. పిల్లలు తరచూ గొడవలు పడుతూ ఉంటే.. పిల్లల మనసు అంత ఆహ్లాదంగా ఉండకపోవచ్చట. ప్రతికూల ప్రభావాలు ఒత్తిడి, ఆందోళన, బిహేవియర్ సమస్యలు , నిద్ర ఆటంకాలు కలిగి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో పిల్లలపై ఇవి చాలా ప్రభావం చూపిస్తాయట.
పిల్లల ముందు వాదించుకునేముందు చేయాల్సినవీ, చేయకూడనివి:
మీ పిల్లల ముందు ఎప్పుడూ మీ పార్ట్ నర్ మీద అరవకండి. మీరు మీ భాగస్వామితో లేదా మీరు వాదిస్తున్న వ్యక్తితో ఏకీభవించనమని చెప్పడం లేదు. కానీ.. గట్టిగా మాట్లాడటం తగ్గించుకోవాలి. అనవసరంగా అరవకూడదు. అరవడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా అరవడం పరిస్థితిని మరింతగా దిగజార్చుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అరుపులు మీ పిల్లలను విపరీతంగా బయపెడతాయి. ఆ భయం వారి నుంచి తొలగించడం చాలా కష్టంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
భిన్నాభిప్రాయాలు జీవితంలో ఒక భాగం. ప్రతి వ్యక్తికి భిన్నమైన అభిప్రాయాలకు హక్కు ఉంటుంది. అయితే.. పిల్లలు చూస్తుండగా మీ భాగస్వామిని ప్రతి విషయంలో బెదిరించడం లాంటివి చేయడం మాత్రం మీకు సమస్యలు తీసుకువస్తుందనే విషయాన్ని గుర్తించాలి. ఇటువంటి హింసాత్మక ప్రవర్తనలు కొన్నిసార్లు మీ బిడ్డ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీరు విపరీతమైన కోపంతో ఊగిపోవడం మీ పిల్లలు చూస్తే.. దాని నుంచి వారు బయటకు రాలేరు. మీకు కోపం వచ్చినా.. మళ్లీ మీ పార్ట్ నర్ తో ప్రేమగా ఉంటారు అనే విషయాన్ని మీ పిల్లలు తెలుసుకోవాలి.
తల్లితండ్రులుగా మారడం, తల్లిదండ్రుల విధులను చేపట్టడం అంత సులభం కాదు. పిల్లల విషయంలో మీరు, మీ భాగస్వామి విభేదించే అనేక అంశాలు ఉన్నాయి. అయితే, మీ పిల్లల పెంపకంపై అభిప్రాయ భేదాలతో సంబంధం లేకుండా, పిల్లల ముందు దాని గురించి వాదించకండి లేదా గొడవపడకండి.
వారి తల్లిదండ్రులు వారిపై పోరాడడాన్ని చూసినప్పుడు, పిల్లలు తమ గురించి తప్పుడు ఆలోచనను పెంచుకోవచ్చు. వారి తల్లిదండ్రుల మధ్య స్థిరమైన అసమ్మతికి తామే కారణమని వారు నమ్మడం ప్రారంభించవచ్చు. ఇదివారు కోపంగా, ఎమోషనల్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంది.
చాలా మంది తల్లిదండ్రులు.. గొడవ జరిగినప్పుడు... మీ పిల్లలను నీకు అమ్మ కావాలా, నాన్న కావాలా అని తేల్చుకోవాలంటూ అడుగుతుంటారు. ఇది పిల్లలపై మరింత ఎక్కువగా ఒత్తిడి తీసుకువస్తుందనే విషయం గురించి ఆలోచించరు. అది పిల్లల్లో మీకు తెలియకుండానే ఒత్తిడి పెంచుకుంటారనే విషయాన్ని తెలుసుకోవాలి.