మీ పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తోందా? ఏం చేయాలో తెలుసా?
నేటి కాలంలో పెద్దలకే కాదు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు పెరుగుతున్నాయి. దీనివల్ల పిల్లలే కాదు వారి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అసలు చిన్న పిల్లలకు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ తేడా లేకుండా తెల్ల జుట్టు ప్రతి ఒక్కరికీ వస్తోంది. ముఖ్యంగా 20 ఏండ్లున్న యువతీ, యువకులకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వీటిని దాచడానికి మెహందీ, కలర్స్ ను జుట్టుకు వేసుకుంటున్నారు. కానీ తెల్లజుట్టు రావడాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఈ తెల్లజుట్టు కేవలం పెద్దలను, యువకులనే కాకుండా చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. అవును ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి.
చిన్న పిల్లలకు తెల్ల వెంట్రుకలు రావడానికి షకాహార లోపం అసలు కారణమంటున్నారు నిపుణులు. నిజానికి జుట్టు తెల్లబడటానికి కారణం జుట్టులో మెలనిన్ లేకపోవడం. తెల్ల జుట్టు తిరిగి నల్లగా మారదు. పోషకాహార లోపాన్ని తగ్గిస్తే మాత్రం ఈ సమస్య ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. అందుకే పిల్లలకు బూడిద, తెల్ల వెంట్రుకలు వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లలకు తెల్ల జుట్టు వస్తే ఏం చేయాలి?
పిల్లలకు తెల్ల జుట్టు రావడానికి.. వారి శరీరంలో విటమిన్ డి, విటమిన్ బి 12 లోపమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ రెండు పోషకాలుండే ఆహారాలను మీ పిల్లల రోజువారి ఆహారంలో చేర్చండి.
kids health
అలాగే ఐరన్, విటమిన్ బి, సోడియం, రాగి వంటి పౌష్టికాహారాన్ని కూడా పిల్లల ఆహారంలో చేర్చాలి. ఎందుకంటే ఇవి కూడా మీ పిల్లలకు తెల్ల జుట్టు రాకుండా కాపాడుతాయి. అలాగే మీ పిల్లల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.
kids
ఆక్సీకరణ ఒత్తిడి మెలనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో పిల్లలకు తెల్ల జుట్టు వస్తుంది. కాబట్టి మీ పిల్లల రోజువారి ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లను చేర్చండి. అంటే మీ పిల్లలకు పండ్లను, కూరగాయలను ఎక్కువగా పెట్టాలి.
Kids food
అలాగే పిల్లలకు వెంట్రుకలు తెల్లబడటానికి వారి ఆహారంలో ఫోలిక్ యాసిడ్ లేకపోవడం కూడా ఒక కారణమే. అందుకే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే బఠానీలు, బీన్స్, గుడ్లను ఎక్కువగా పెట్టండి. మీ పిల్లలకి జుట్టు తెల్లబడుతున్నట్టైతే వాళ్లకి ఉసిరి కాయలను ఇవ్వండి. ఎందుకంటే ఉసిరిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును బలంగా చేయడమే కాకుండా జుట్టు నల్లగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. వీటితో పాటుగా మీ పిల్లలకు అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా ఇవ్వండి. క్యారెట్లు, అరటిపండ్లలో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది.
జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మీ పిల్లలకు తెల్ల వెంట్రుకలు రాకూడదంటే వారికి స్నాక్స్ ను ఇవ్వకండి. సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. కాబట్టి పిల్లల్ని ఎక్కువసేపు ఎండలో ఉంచకూడదు. కాలుష్యం వల్ల కూడా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి.