ప్రెగ్నెన్సీ టైం లో రొమ్ముల్లో నొప్పి.. తగ్గాలంటే ఇలా చేయండి
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారి రొమ్ముల్లో ఎన్నో మార్పులు వస్తాయి. దీనివల్లే అవి విపరీతంగా నొప్పి పెడతాయి. అయితే కొన్ని చిట్కాలతో నొప్పిని తగ్గించుకోవచ్చు.
స్త్రీలు గర్భవతి అయినప్పుడు.. వారి శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో రొమ్ముల్లో నొప్పి ఒకటి. గర్భం ప్రారంభ దశలో ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. కొంతమందికి అయితే డెలివరీ అయ్యేదాకా ఈ నొప్పి అలాగే ఉంటుంది. నిజానికి ప్రెగ్నెన్సీ సమయంలో వక్షోజాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని తాకడం వల్ల నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.
గర్భధారణ సమయంలో రొమ్ముల్లో నొప్పి ఎందుకు కలుగుతుంది?
తల్లి పాలివ్వడానికి స్త్రీల శరీరం సిద్ధమవుతున్నప్పుడు.. వారి వక్షోజాలు ఎన్నో మార్పులకు లోనవుతాయి. సర్వ సాధారణమైన గర్భధారణ సమస్యలలో రొమ్ముల్లో నొప్పి లేదా లేత రొమ్ములు ఒకటి. గర్భధారణ సమయంలో రొమ్ముల్లో నొప్పి ఎక్కువగా శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు పెరగడం వల్ల. ఇవి రొమ్ములోని పాల నాళాలు, గ్రంథులు పెద్దవి కావడానికి కారణమయ్యే హార్మోన్లు. ఇది వాపు, సున్నితత్వానికి దారితీస్తుంది. ఈ సున్నితత్వం వల్లే నొప్పి కొద్దిగా లేదా విపరీతంగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో రొమ్ములకు రక్త ప్రవాహం పెరగడం వల్ల కూడా నొప్పి కలుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ములు పెరుగుతాయి. అలాగే విస్తరిస్తాయి. చర్మం, సహాయక కణజాలాలు సాగుతాయి కూడా. ఇవన్నీ అసౌకర్యం లేదా నొప్పికి దారితీస్తాయి.
breast
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ముల నొప్పి ఎక్కువ రోజులు ఉండదు. ఈ నొప్పి గర్భధారణ తర్వాత కొన్ని రోజులలోనే ప్రారంభమవుతుంది. కొంతమంది మహిళలకు మొదటి త్రైమాసికం లోనూ, రెండో త్రైమాసికంలో కూడా ఉంటుంది. ఎందుకంటే గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాల్లో రొమ్ము సున్నితత్వానికి కారణమయ్యే హార్మోన్ల మార్పులు తీవ్రంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ గర్భధారణలో వచ్చే సమస్యలు ప్రతి మహిళకు భిన్నంగా ఉంటాయి. నిజానికి కొంతమంది మహిళలకు రొమ్ముల్లో నొప్పి అసలే ఉండకపోవచ్చు. అయితే ఇంకొంత మంది మహిళలకు ఇలాంటి నొప్పి కొన్ని వారాల్లోనే తగ్గిపోతుంది. మరికొందరు డెలివరీ వరకు ఈ నొప్పిని భరించాల్సి వస్తుంది. మరి రొమ్ముల నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
breast pain
సపోర్టింగ్ బ్రా
బాగా అమర్చిన బ్రా లు రొమ్ముల కదలికను తగ్గించడానికి, గర్భధారణ సమయంలో రొమ్ముల నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. మృదువైన, శ్వాసించదగిన క్లాత్ తో తయారైన బ్రాను కొనండి. అండర్ వైర్ బ్రాలను వేసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది జాగ్రత్త..
వెచ్చని లేదా చల్లని కంప్రెస్
వెచ్చని టవల్ లేదా హీటింగ్ ప్యాడ్ వంటి వెచ్చని కంప్రెస్ ను వాడటం వల్ల కూడా వక్షోజాల నొప్పి, మంట తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఐస్ ప్యాక్ లు వంటి కోల్డ్ కంప్రెస్ లు కూడా రొమ్ము నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
నొప్పి నివారణలు
గర్భధారణ సమయంలో రొమ్ముల నొప్పిని తగ్గించడానికి ఎసిటమినోఫెన్ (టైలెనాల్) వంటి ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారణలు కూడా సహాయపడతాయి. అయితే షాపుల్లోంచి పెయిన్ రిలీవర్ కొనడమే కాదు.. గర్భధారణ సమయంలో ఏదైనా మందులను తీసుకునే ముందు డాక్టర్ సలహాను ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇదే మిమ్మల్ని, మీ బిడ్డను సురక్షితంగా ఉంచుతాయి.
మంచి భంగిమ
పేలవమైన భంగిమ కూడా గర్భధారణ సమయంలో రొమ్ముల నొప్పికి, అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే ఈ నొప్పి రాకూడదంటే నిటారుగా నిలబడండి. అస్సలు వంగి నవకూడదు. కూర్చోకూడదు. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు ఇలా వంగకూడదు.
మసాజ్
సున్నితంగా మీ చేతులతో మీ రొమ్ములను మసాజ్ చేయండి. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను పెంచడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మసాజ్ ను మరింత సౌకర్యవంతంగా చేయడానికి వెచ్చని, తడి వాష్ క్లాత్ లేదా నూనెతో మసాజ్ చేయండి.