MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • మీ పిల్లలు మీ కంటే ముందే నిద్రలేస్తున్నారా? అయితే ఇలా చేయండి

మీ పిల్లలు మీ కంటే ముందే నిద్రలేస్తున్నారా? అయితే ఇలా చేయండి

పిల్లలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు. ఏ చిన్న చప్పుడైనా ఇట్టే లేచి కూర్చుంటారు. ముఖ్యంగా చాలా మంది పిల్లలు పేరెంట్స్ లేవకముందే ముందే నిద్రలేస్తారు. వారు లేవడమే కాకుండా ఇంట్లో అందరినీ లేపుతారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో పిల్లలు ఎవ్వరినీ నిద్రలేపకుండా చేయొచ్చు. అదెలాగంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 08 2024, 02:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఉదయం ఇంకొంచెం నిద్రపోతే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఉదయం చాలా సేపు పడుకుంటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు.  ఎందుకంటే చిన్న పిల్లలు రాత్రిపూట సరిగ్గా నిద్రపోనివ్వరు. వారు పడుకోరు. తల్లిదండ్రులను కూడా పడుకోనివ్వరు. అందుకే వీళ్లకు ఉదయం ఇంకొంచెం సేపు నిద్రపోతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ పిల్లలు ఉదయం, సాయంత్రం వేళల్లో బాగా నిద్రపోతుంటారు. దీంతో వారు నైట్ టైం సరిగ్గా నిద్రపోరు. ఒకవేళ నిద్రపోయినా మధ్యమధ్యలో లేస్తూనే ఉంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ పిల్లలకున్న ఈ అలవాటు తల్లిదండ్రులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చాలా మంది పిల్లలు తెల్లవారక ముందే నిద్రలే ముందు కూర్చుంటారు. అంతేకాక తల్లిదండ్రులను కూడా నిద్రలేపుతుంటారు. కానీ ఈ సమయంలో పిల్లలు మళ్లీ నిద్ర అస్సలు పోరు. దీనివల్ల తల్లిదండ్రులు కూడా నిద్రలేవాల్సి వస్తుంది. అయితే మీరు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే.. మీ పిల్లలను బిజీగా ఉంచొచ్చు. అలాగే మీరు హాయిగా కొద్దిసేపు పడుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
 

36

పజిల్ గేమ్ లను ఉంచండి

పజిల్ గేమ్ మీ పిల్లల్ని ఎక్కువ సేపు ఆడుకోవడానికి సహాయపడుతుంది. ఈ పజిల్ గేమ్ లో మీ పిల్లవాడు గంటల తరబడి బిజీగా ఉంటాడు. అలాగే అక్కడి నుంచి ఎటూ కదలడు. దీంతో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా హాయిగా నిద్రపోగలుగుతారు. 

46

బిల్డింగ్ బ్లాక్ టవర్

రాత్రిపూట బెడ్ దగ్గర పిల్లలు ఆడుకునే బిల్డింగ్ బ్లాక్ గేమ్ ముందుగానే ఉంచండి. పొద్దున్నే వాళ్లు నిద్రలేవగానే అవి కనిపిస్తాయి. దీంతో పిల్లలు మిమ్మల్నిడిస్టబ్ చేయకుండా ఆటోమేటిక్ గా రంగురంగుల బిల్డింగ్ బ్లాక్స్ కు ఆకర్షితుడై వాటితో ఆడుకుంటాడు. బిల్డింగ్ బ్లాక్స్ కూడా ఎక్కువ సేపు బిజీగా ఉండటానికి సహాయపడుతుంది. దీనిలో మీ పిల్లలు గంటల తరబడి వివిధ రకాల టవర్లను నిర్మించడంలో బిజీగా ఉంటాడు. అలాగే మీరు కూడా ఓ కునుకు తీయొచ్చు. 

56

కలరింగ్ బుక్ 

మీ మంచం సైడ్ టేబుల్ పై కలరింగ్ బుక్, కలర్ పెన్సిల్స్ ను ఉంచండి. పిల్లలకు రంగులంటే చాలా ఇష్టం. అందుకే పొద్దున్నే లేవగానే రంగులు చూసి వాటితో ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది మీ పిల్లలను సురక్షితంగా ఉంచుతుంది. అలాగే వీళ్లు మీ దగ్గరే ఉంటారు. అలాగే ఇది వారి సృజనాత్మకతను కూడా పెంచుతుంది.
 

66

చైల్డ్ సేఫ్ ఏరియాను సిద్ధంగా ఉంచుకోండి

పిల్లవాడు నిద్రపోయే చోట హాని చేసే వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. అలాగే వారికి గాయాలయ్యే వాటిని కూడా ఉంచకూడదు. అప్పుడే వారు హాయిగా అటూ ఇటూ నడవగలుగుతారు. ఆడుకోగలుగుతారు. అలాగే వారు ఆడుకునే చోట మృదువైన బొమ్మను పెట్టండి.  స్విచ్ బోర్డ్ కు కవర్ ను పెట్టండి. మంచం మూలల్లో బెడ్ కార్నర్ ప్రొటెక్టర్ ఉంచండి. దీంతో మీరు హాయిగా నిద్రపోవచ్చు. అలాగే మీ పిల్లలు సేఫ్ జోన్ లో ఉంటారు. ఇది మీ పిల్లలను సురక్షితంగా ఉంచుతుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved