MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • 30 ఏండ్లకు గర్భం.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

30 ఏండ్లకు గర్భం.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

కెరీర్ లో సెట్ కావాలని చాలా మంది పిల్లల్ని లేట్ గా కంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది 30 ఏండ్ల తర్వాతే పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే 30 ఏండ్ల వయసులో గర్భం దాల్చితే మాత్రం మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సిందే..

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 07 2023, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ మధ్యకాలంలో చాలా మంది కెరీర్ లో స్థిరపడిన తర్వాతే పెళ్లి, పిల్లల గురించి ఆలోచిస్తున్నారు.పలు సర్వేల ప్రకారం.. 30 ఏండ్లు దాటిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ  30 ఏండ్లు దాటిన తర్వాత స్త్రీ, పురుషులిద్దరిలో సంతానోత్పత్తి తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం 30 ఏండ్లు దాటిని తర్వాత కూడా గర్బం దాల్చొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఈ టెస్ట్ లు తప్పనిసరి

ఒకప్పుడు పెద్దవయసు వారికి మాత్రమే లేనిపోని రోగాలు అంటే థైరాయిడ్, డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు వచ్చేవి. ఇప్పుడు ఈ సమస్యలు చిన్నవయసు వారికి కూడా వస్తున్నాయి. అందుకే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందే పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. గర్భం దాల్చడానికి ఫోలిక్ ఆమ్లంఎంతో సహాయపడుతుంది. అందుకే ప్రగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు మీరు ఫోలిక్ యాసిడ్ ను పుష్కలంగా తీసుకోవాలి. 

35

కలయిక తర్వాత..

గర్భందాల్చడాని ప్రయత్నించే వారు కలయిక తర్వాత కాసేపు అంటే 10 నుంచి 15 నిమిషాలు మంచం మీదే పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే మీ కాళ్లు కాస్త ఎత్తులో ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా సెక్స్ తర్వాత మీరు బాత్రూంకు వెళ్లకూడదు. ఎందుకంటే 10 నుంచి 15 నిమిషాల పాటు మీరు అలాగే ఉంటే వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోతాయి. 
 

45

తరచుగా సెక్స్ 

అండోత్సర్గము సమయంలో మీరు రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి స్పెర్మ్ మీ శరీరంలో 5 రోజుల వరకు బతికే ఉంటుంది. అయితే మీరు ఈ సమయంలో టైట్ బట్టలను వేసుకోకూడదు. ఎందుకంటే టైట్ బట్టలు పురుషఉల్లో స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. అందుకే వదులుగా ఉండే బట్టలనే వేసుకోవాలి. 
 

55

ఒత్తిడికి దూరంగా 

ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది మీరు గర్భందాల్చాన్న కలను కూడా నాశనం చేస్తుంది. ఈ సమయంలో మీరు ఎంత సంతోషంగా ఉంటే.. అంత తొందరగా మీరు గర్భందాల్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆల్కహాల్, సిగరేట్ అలవాటుంటే మానుకోండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image2
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Recommended image3
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved