ప్రతిరోజూ పిల్లలను ఈ ప్రశ్నలు అడుగుతున్నారా లేదా..?
ప్రతిరోజూ పిల్లలను పేరెంట్స్ కొన్ని ప్రశ్నలు అడగాలంట. ఒక్కరోజు అడిగితే సరిపోదు.. ప్రతిరోజూ అడగాలి అంట. మరి ఎలాంటి ప్రశ్నలు అడగాలో ఇప్పుడు చూద్దాం..
పిల్లల ఎదుగుదల సరిగా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే.. ఆ ఎదుగుదల మనం పిల్లలతో ఏర్పరుచుకునే కమ్యూనికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. పిల్లలతో కమ్యూనికేషన్ సరిగా ఉన్నప్పుడే వాళ్ల ప్రపంచం అర్థం అవుతుంది. అలా అర్థం అవ్వాలి అంటే... ప్రతిరోజూ పిల్లలను పేరెంట్స్ కొన్ని ప్రశ్నలు అడగాలంట. ఒక్కరోజు అడిగితే సరిపోదు.. ప్రతిరోజూ అడగాలి అంట. మరి ఎలాంటి ప్రశ్నలు అడగాలో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది పేరెంట్స్ పిల్లలతో చాలా సీరియస్ గా ఉంటారు. వాళ్లను ఏ విషయం అడగాలన్నా.. సీరియస్ గానే అడుగుతారు. పిల్లలు స్కూల్ కి వెళ్లిరాగానే చాలా మంది పేరెంట్స్ ఈ రోజు ఎలా జరిగింది అని అడుగుతారు. అది మంచి పద్దతే కానీ.. అది కూడా చాలా ఫన్నీగా ఉండాలి. ఈ రోజు ఏదైనా ఫన్నీగా జరిగిందా..? అదేంటి..? దానిని నువ్వు ఎలా ఎంజాయ్ చేశావ్ లాంటి ప్రశ్నలు అడగాలి. దీని వల్ల.. పిల్లల్లో ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ మీకు అర్థమౌతుంది. ఎంత చిన్న విషయాలకు పిల్లలు సంతోషపడుతున్నారనే విషయం అర్థమౌతుంది.
ఈరోజు నీకు ఎవరైనా ఏదైనా విషయంలో హెల్ప్ చేశారా..? వాళ్లు హెల్ప్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది లాంటి ప్రశ్నలు కూడా అడగాలి. లేదంటే.. నువ్వు ఎవరికైనా సహాయం చేశావా లాంటి ప్రశ్నలు వేయాలి. దీని వల్ల... పిల్లలకు జాలి, దయ అనే విషయాలు అర్థమౌతాయి. పిల్లలకు ఇతరులకు సహాయం చేయాలి అనే విషయం అర్థం అవుతుంది. మంచి అలవాటు కూడా అలవడుతుంది.
ఈరోజు నువ్వు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నావా..? ఈ ప్రశ్న కూడా రోజూ అడగాలి. దాని వల్ల.. పిల్లలకు కొత్త పదాలు నేర్చుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. పిల్లల్లో లెర్నింగ్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి.
ఈరోజులో నువ్వు చేసిన ఏదైనా పనిని మార్చుకోవాలి అనుకుంటున్నావా? అనుకుంటే అది ఏంటి..? ఈ విషయం కూడా కచ్చితంగా పిల్లలను అడిగి చూడండి. దీని వల్ల పిల్లలు తాము ఏదైనా చెడు పని చేస్తే దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవచ్చు దాని వల్ల... మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది వారికి చాలా మేలు చేస్తుంది.
రేపటి లక్ష్యం గురించి కూడా ప్రతిరోజూ పిల్లలను అడిగి తెలుసుకోవాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు లేకపోయినా పర్వాలేదు.. రేపు ఏం చేయాలి అనుకుంటున్నావ్ అని అడగాలి. ఇలా మీరు రోజూ అడగడటం వల్ల పిల్లలకు రేపటి గురించి ఆలోచించడం అలవాటు అవుతుంది.
గడిచిన రోజులో నీకు నచ్చిన విషయం ఏమిటి..? మీకు సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం ఏమిటి లాంటి విషయాలు కూడా రోజూ వారిని అడగాలి. మీ పిల్లలు చెప్పే సమాధానాలు కూడా ఓపికగా వినాలి.