పిల్లల్లో ఏకాగ్రత పెంచే యోగాసనాలు..!
ఈ యోగాసనం పిల్లలతో క్రమం తప్పకుండా చేయిస్తే.. వారిలో ఏకాగ్రత సులభంగా పెరుగుతుంది. ఇక బాడీ బ్యాలెన్స్, అటెన్షన్ పెరగడానికి వృక్షాసన యోగాసనం చేయాలి. ఇది కూడా ఏకాగ్రత పెంచుతుంది.
yoga
యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. ఈ యోగా చేయడం వల్ల మనసుకి ప్రశాంతత కలుగుతుంది. అంతేకాదు.. మెదడుకు ఏకాగ్రత పెంచడానికి కూడా యోగా సహాయపడుతుంది. అయితే.. ఇదే యోగా.. చిన్నపిల్లల్లో ఏకాగ్రత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది పిల్లలు చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ క్రమంలో వారు చదువుల్లో వెనకపడిపోతుంటారు. మీ పిల్లలు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. కొన్ని రకాల సులభమైన యోగాసనాలు పిల్లలతో వేయించడం ద్వారా వారిలో ఏకాగ్రత పెంచవచ్చు.
ఏకాగ్రత పెంచే యోగాసనం పేరు వక్రాసనం. దీనిని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. నేలమీద నిటారుగా కూర్చుని కాళ్ళు తిన్నగా చాపండి.
ఒక కాలిని మడిచి పక్కకి తీసి దాని పాదం మరో మోకాలి పక్కన వచ్చేలా పెట్టాలి. ఏ కాలైతే వంచామో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలిమీదుగా పెట్టి పాదాన్ని పట్టుకోవాలి. వీలైనంత వరకు నడుమును అటువైపుగా తిప్పాలి, ఇదే మాదిరిగా రెండవ కాలిని మడిచి మరల అదే విధంగా చేయిని, నడుమును తిప్పాలి, ఇలా కనీసం మూడు సార్లు కుడి వైపు, మూడు సార్లు ఎడమ వైపు తిప్పాలి.
ఈ యోగాసనం పిల్లలతో క్రమం తప్పకుండా చేయిస్తే.. వారిలో ఏకాగ్రత సులభంగా పెరుగుతుంది. ఇక బాడీ బ్యాలెన్స్, అటెన్షన్ పెరగడానికి వృక్షాసన యోగాసనం చేయాలి. ఇది కూడా ఏకాగ్రత పెంచుతుంది.
ముందుగా రెండు కాళ్లపై నిటారుగా నిల్చోవాలి. ఆ తర్వాత.. ఒక కాలుని వంచి.. దాని పాదాన్ని మరో కాలు తొడపై ఉంచాలి. ఇలా కొద్ది సేపటి వరకు అలానే నిలపడాలి. తర్వాత రెండో కాలుతో కూడా దీనిని రిపీట్ చేయాలి. దీనిని కూడా తరచూ చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.