Parenting tips: మీ పిల్లలు తెలివైన వారో కాదో ఇలా తెలుసుకోవచ్చు!
తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగాలని కోరుకుంటారు. అయితే పిల్లలు తెలివైనా వాళ్ల లేదా అని ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? పిల్లల ప్రవర్తనలో కనిపించే ప్రత్యేక లక్షణాలతో వారు తెలివైన వాళ్లో కాదో ఈజీగా తెలుసుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించేది మాత్రం వారి ఆరోగ్యం, తెలివి గురించి. అయితే కొన్ని లక్షణాలతో పిల్లలు తెలివైనవారా కాదా సులువుగా తెలుసుకోవచ్చట. అదెలాగా అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి మరి.
ఎలా తెలుసుకోవాలి?
పుట్టిన తర్వాత పిల్లలు తెలివైన వాళ్లా కాదా అనేది వాళ్ళ అలవాట్లను బట్టి చెప్పొచ్చు. కొంచెం శ్రద్ధ పెడితే అది తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. పిల్లల పనులను గమనిస్తే వాళ్ళలో తెలివైన లక్షణాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది. మీ పిల్లలు తెలివైన వాళ్ళు అవుతారో లేదో ఇలా తెలుసుకోండి.
త్వరగా మాట్లాడటం:
ఏడాదిలోపు పిల్లలు కొన్ని మాటలు మాట్లాడతారు. ఏడాదిన్నరకి ఇంకా స్పష్టంగా మాట్లాడుతారు. తెలివైన పిల్లలు త్వరగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.
సాంఘిక నైపుణ్యం:
మీ పిల్లలు ఎవరితోనైనా వెంటనే కలిసిపోతారా? అలా అయితే వాళ్ళకి మంచి సంబంధాలు ఏర్పరుచుకునే శక్తి ఉందని మీరు గమనించాలి.
కొంచెం మొండితనం:
సాధారణంగా పిల్లల్లో కొంచెం మొండితనం ఉండటం మంచిదే. దానివల్ల వాళ్ళకి సొంతంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది.
శారీరక ఎదుగుదల:
కూర్చోవడం, పాకడం, నిలబడటం లాంటివి ఒక టైమ్ ప్రకారం జరుగుతాయి. మీ పిల్లలు తొందరగా చేస్తే వాళ్ళు తెలివైన వాళ్ళని అర్థం చేసుకోవచ్చు.
ఎక్కువసేపు శ్రద్ధ:
పిల్లలు 15 నిమిషాల కంటే ఎక్కువసేపు దేనిమీద శ్రద్ధ పెట్టలేరు. మీ పిల్లలు ఎక్కువసేపు శ్రద్ధ పెడితే వాళ్ళకి ఆ శక్తి ఉందని తెలుస్తుంది.
ఆసక్తి:
మీ పిల్లలు బొమ్మలు లేదా వేరే వస్తువులు విరిచి లోపల ఏముందో చూస్తారా? అలా చేస్తే వాళ్ళకి ఆసక్తి ఉందని అర్థం.
జ్ఞాపకశక్తి:
మీ పిల్లలు విషయాలను ఈజీగా గుర్తుపెట్టుకుంటున్నారా? అయితే వారికి మంచి జ్ఞాపకశక్తి ఉందని అర్థం.
సమస్య పరిష్కార నైపుణ్యం:
మీ పిల్లలు కష్టమైన సమస్యలను కూడా ఈజీగా పరిష్కరిస్తారా? అయితే వారికి పరిష్కార నైపుణ్యం ఉందని మీరు గుర్తించాలి.
సృజనాత్మకత:
మీ పిల్లలు కొత్తవి తయారు చేయడానికి లేదా ఆలోచించడానికి ఇష్టపడతారా? అయితే వారు క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారని అర్థం.
ఇవి గుర్తించుకోండి
ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైనవాడు. మీ పిల్లలను వేరే పిల్లలతో పోల్చకండి. ఈ విషయాలన్నీ కొన్ని పరిశోధనల ద్వారా తెలుసుకున్నవి.