MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • వాస్తు ప్రకారం.. పసిపిల్లల దగ్గర ఇవి అస్సలు ఉంచకూడదు

వాస్తు ప్రకారం.. పసిపిల్లల దగ్గర ఇవి అస్సలు ఉంచకూడదు

వాస్తు శాస్త్రం మన శ్రేయస్సు గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. అయితే వాస్తు ప్రకారం.. పిల్లలు బాగుండాలంటే వారి దగ్గర కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. అవేంటంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 16 2024, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
parenting tips

parenting tips

వాస్తు శాస్త్రం ప్రకారం..  పసిపిల్లల గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. దీని ప్రకారం.. పసిబిడ్డ దగ్గర ఉంచకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి వారి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు మీ బిడ్డ దగ్గర ఏం ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ముళ్ల మొక్కలు

ఈ మొక్కల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొక్కలు అందంగా ఉంటాయి. ఇంటిని అందంగా కనిపించేలా చేస్తాయి.అందుకే చాలా మంది ముళ్ల మొక్కలను కూడా గార్డెన్ లో పెంచుతుంటారు. కానీ వీటికి పదునైన ముళ్లు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే సమస్యలు వస్తాయి.అలాగే వాస్తు ప్రకారం.. ఈ మొక్కలు చెడు శక్తిని తెస్తాయి. ఇది మీ బిడ్డను ప్రభావితం చేస్తుంది. వారిని అసౌకర్యానికి గురి చేస్తుంది.
 

36

అద్దాలు

ప్రతి ఒక్కరి ఇళ్లలో అద్దాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాస్తు ప్రకారం.. చిన్న పిల్లలను అద్దంలో చూపించకూడదు. మీ పిల్లలున్న గదిలో అద్దాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే గాజు శక్తిని ప్రతిబింబిస్తుంది.  కాబట్టి ఇది పిల్లలకు చంచలతను కలిగిస్తుంది. ఇది వారి నిద్రను ప్రభావితం చేస్తుంది.
 

46

విరిగిన బొమ్మలు

వాడుతున్న కొద్దీ బొమ్మలు విరగడం, పగిలిపోవడం జరుగుతుంటుంది. ఇది సర్వ సాధారణ విషయం. అయినప్పటికీ.. విరిగిన బొమ్మలను మీ పిల్లలు ఉన్న చోట ఉంచకండి. వాస్తు ప్రకారం ఇది వారికి చెడు వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇది వారి శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.

56

ప్రతికూల పెయింటింగ్స్

మీ పిల్లల గదికి పెయింటింగ్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి కూడా మీ పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. హింసాత్మక లేదా ఇబ్బందికరమైన శీర్షికలను చిత్రీకరించే పెయింటింగ్ కు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా మీ బిడ్డకు ప్రేమపూర్వక వాతావరణాన్ని అందించడానికి ఉల్లాసకరమైన, ఉత్సాహభరితమైన పెయింటింగ్ లను వేయాలి. అలాగే ఆనందంగా, ఆశను వ్యక్తపరిచే చిత్రాలను  కూడా పిల్లల గదిలో ఉంచొచ్చు. 

66

భారీ చెక్క ఫర్నిచర్

పిల్లలున్న గదిలో బరువైన వస్తువులను ఉంచడం మంచిది కాదు. వాస్తు ప్రకారం.. ఎక్కువ స్పేస్ లేకుండా ఉంటే స్వేచ్ఛగా శక్తి ప్రవాహం తగ్గుతుంది. ఇది మీ బిడ్డకు అసౌకర్యం కలిగిస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా?
Recommended image2
Tamannaah: తల్లిగా తన కోరికని బయట పెట్టిన తమన్నా.. అమ్మలా అస్సలు ఉండనంటూ బోల్డ్ స్టేట్ మెంట్
Recommended image3
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved