మీ పిల్లల్లో ఇవి గమనించారా? అయితే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి
చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా డయాబెటీస్ ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో మార్పులు. అయితే పిల్లలకు డయాబెటీస్ వస్తే ఎలా ఉంటారో తెలుసా?
diabetes
డయాబెటిస్ ఒక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా దీని బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇన్సులిన్ లేదా ఇన్సులిన్ నిరోధకత లేకపోవడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా కష్టమవుతుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీనినే డయాబెటీస్ అంటారు.
diabetes
డయాబెటిస్ పెద్ద వయసు వారికి మాత్రమే వచ్చే వ్యాధి అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ మారుతున్న జీవనశైలి వల్ల ఈ వ్యాధి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తోంది. కానీ ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఈ వ్యాధి పిల్లల అభివృద్ధిని, వారి సాధారణ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే పిల్లలలో డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను గుర్తించి చికిత్స చేయించాలి. దీంతో సమస్య పెరగదు. మరి ఏ లక్షణాలతో పిల్లల్లో డయాబెటీస్ ను గుర్తించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు తగ్గడం
మీ పిల్లల అకస్మాత్తుగా బరువు తగ్గడం అంత మంచి విషయం కాదు. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ఇది డయాబెటిస్ కు సంకేతం కావొచ్చు. ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం డయాబెటిస్ లక్షణం. అయితే ఈ లక్షణం ఎక్కువగా టైప్ -1 డయాబెటిస్ లో కనిపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ లో కూడా ఈ లక్షణం ఉంటుంది.
Diabetes in children
అలసట
మీ పిల్లవాడు త్వరగా అలసిపోతుంటే లేదా ఎప్పుడూ అలసిపోయినట్టుగా అనిపిస్తే కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది కూడా డయాబెటిస్ కు సంకేతం కావొచ్చు. శారీరక శ్రమ లేకుండా అలసిపోవడం మంచి విషయం కాదు. అందుకే మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి.
diabetes
దాహం పెరగడం
రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల విపరీతంగా దాహం అవుతుంది. అందుకే మీ పిల్లవాడు అకస్మాత్తుగా అవసరానికి మించి నీళ్లను ఎక్కువగా తాగినా లేదా పదే పదే దాహం అంటున్నా హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది డయాబెటీస్ కు సంకేతం.
diabetes
ఆకలి పెరగడం
మీ బాబు ఎప్పుడూ ఆకలి ఆకలి అన్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది సమస్య కావొచ్చు. కడుపు నిండా భోజనం చేసినా కూడా పిల్లలకు ఆకలిగా అనిపించడం షుగర్ వ్యాధి లక్షణమేనంటున్నారు నిపుణులు.
తరచుగా మూత్రవిసర్జన
బ్లడ్ షుగర్ పెరగడం వల్ల ఎప్పుడూ దాహం వేస్తుంది. నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల మూత్ర విసర్జన కూడా తరచుగా చేయాల్సి వస్తుంది. మీ పిల్లలు తరచుగా మూత్రం పోయడం లేదా నిద్రపోయేటప్పుడు పక్క తడపడం కూడా సమస్యేనంటున్నారు నిపుణులు.
మూడ్ లో మార్పులు
ఎప్పుడూ ఏడుపు, చిరాకు, కోపం వంటి.. పిల్లల మూడ్ లో అకస్మాత్తుగా మార్పు వస్తే అది కూడా మధుమేహానికి సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. మీ పిల్లల్లో ఈ సంకేతాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.