Infants: 6 నెలల లోపు పిల్లలకి వాటర్ తాగిస్తే ఏమవుతుందో తెలుసా?
చిన్న పిల్లలకి నీళ్ళు ఇస్తే ప్రమాదమా?: ఆరు నెలల లోపు పిల్లలకి ఎందుకు నీళ్ళు ఇవ్వకూడదు? ఇస్తే ఏమవుతుంది? ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.

శరీరానికి ఫుడ్ ఎంత ముఖ్యమో వాటర్ కూడా అంతే ముఖ్యం. శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే ఇక అంతే పని. ఎక్కడలేని సమస్యలన్నీ వస్తాయి. అందుకే డాక్టర్లు నీళ్లు బాగా తాగాలని చెబుతూ ఉంటారు. పెద్దవారి సంగతీ ఒకే. కానీ 6 నెలల లోపు చిన్నారులకు నీళ్లు తాగించడం మంచిదా కాదా అని చాలామంది పేరెంట్స్ సందేహ పడుతుంటారు. దానికి డాక్టర్లు ఏం చెబుతున్నారో చూడండి.
నీళ్లు ఎందుకు ఇవ్వకూడదు?
పుట్టిన పిల్లలకి ఆరు నెలల వరకు నీళ్ళు అస్సలు ఇవ్వకూడదు అంటున్నారు డాక్టర్లు. దానికి కొన్ని కారణాలు చెబుతున్నారు. పుట్టిన పిల్లల కిడ్నీలు ఆరు నెలల వరకు పూర్తిగా డెవెలప్ కావట. నీళ్ళు ఇస్తే, ఎక్కువ నీరు, సోడియం బయటకి వెళ్ళిపోతాయి. దానివల్ల పిల్లలకి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
పిల్లల్లో సమస్యలు
ఆరు నెలల లోపు పిల్లలకి నీళ్ళు ఇస్తే సోడియం తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళ మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో మానసిక సమస్యలకు దారితీస్తుంది. ముఖం, కాళ్ళు, చేతులు వాపు కూడా రావచ్చు. పోషకాహార లోపం, నెమ్మదిగా పెరగడం, బరువు తగ్గడం లాంటి సమస్యలు కూడా వస్తాయి.
ఏమి ఇవ్వాలి?
పుట్టిన పిల్లలకి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మలబద్ధకం లేదా ఎక్కువ వేడిగా ఉంటే ఒక చెంచాలో కొంచెం నీళ్ళు ఇవ్వచ్చు. కానీ, డాక్టర్ ని అడిగిన తర్వాత ఆయన సలహా ప్రకారమే పిల్లలకు వాటర్ తాగించాలి.