పిల్లలకు పాలు మంచివా? పెరుగు మంచిదా?
పాలు, పెరుగు రెండూ పెద్దలకే కాదు పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే ఈ రెండింటిలో పిల్లలకు ఏది ఎక్కువ మంచిదో తెలుసా?
పాలు, పెరుగు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొంతమంది పాలు తాగితే, మరికొంతమంది పెరుగును రెగ్యులర్ గా తింటుంటారు. పాలు, పెరుగు రెండూ దేనికవే కొన్ని ప్రత్యేకమైన పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఈ రెండింటిలో పిల్లల ఆరోగ్యానికి ఏవి ఎక్కువ మంచి చేస్తాయో తెలుసా?
పాలలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా దీంట్లో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి 2, విటమిన్ బి 12, భాస్వరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇకపోతే పెరుగులో విటమిన్ సి తో పాటుగా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉండే కాల్షియం ఎముకల్ని బలంగా ఉంచుతుంది.
అందుకే పాలు లేదా పెరుగు రెండింటినీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఏదేమైనా ప్రతి ఒక్కరూ ఈ రెండింటిలో ఒక్కదాన్ని మాత్రమే తీసుకుంటారు.
అయితే చాలా మంది పిల్లలు పాలను అస్సలు తాగడానికి ఇష్టపడరు. కొంతమంది పిల్లలు మాత్రం పాలు తాగి పెరుగును తినడానికి ఇష్టపడరు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లల ఆరోగ్యానికి పాలు మంచివా? పెరుగు మంచిదా?అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాలు లేదా పెరుగు
పిల్లలకు 6 నెలల వయసు వచ్చిన తర్వాత పెరుగును తమ ఆహారంలో చేర్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పిల్లలకు పెరుగు కూడా చాలా అవసరం. ఎందుకంటే పెరుగులో పిల్లల ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పెరుగు ఒక మంచి ప్రోబయోటిక్ ఫుడ్ కూడా.
పిల్లల కడుపును ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అయితే పిల్లలకు పెరుగును తినిపించేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు.. కోల్డ్ ఫ్రిజ్ లో ఉంచిన పెరుగును పిల్లలకు తినిపించకూడదు.
పిల్లలకు ఎప్పుడూ కూడా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగును మాత్రమే ఇవ్వాలి. పిల్లలకు పెరుగును ఇచ్చినంత మాత్రానికి వారికి పాలు ఇవ్వకుండా ఉండకూడదు. పెరుగుతో పాటుగా పిల్లలకు పాలు కూడా అవసరమే. కానీ రోజుకు ఒకేసారి మాత్రమే పాలను ఇవ్వాలి.
పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పాలతో పోలిస్తే.. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. పాలను ఎక్కువ తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి.
కానీ పెరుగు జీర్ణక్రియను సరిచేయడానికి సహాయపడుతుంది. దీనితో పాటుగా పెరుగు చిన్న పిల్లల కడుపు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా సహాయపడుతుతుంది.
పెరుగులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని పిల్లలకు పెడితే పెరుగు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
పిల్లలకు క్రమం తప్పకుండా పెరుగును పెట్టడం వల్ల వారికి సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు, జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
curd
పిల్లలకు పెరుగు పెట్టాలా, లేకపోతే పాలు ఇవ్వాలా అని నిర్ణయించుకునేటప్పుడు మీరు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
మీ పిల్లలకి కనుక లాక్టోస్ అసహనం ఉన్నా, వారి జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉన్నా వారికి పాలను ఇవ్వకండి. పెరుగునే పెట్టండి. పిల్లల్లో ప్రోబయోటిక్స్ అవసరాన్ని తీర్చడానికి పెరుగు మంచిది.
ఇకపోతే పాలను మాత్రమే తాగే పిల్లలకు ఇతర ఆహార అలవాట్లను నేర్పించడం కొంచెం కష్టమే. అలాగే వీళ్లు ఒక్క పాలను మాత్రమే తాగుతారు. పెరుగును తినడానికి ఇష్టపడరు.
కానీ పిల్లలకు పెరుగును ఖచ్చితంగా తినిపించాలి. దీనివల్ల టేస్ట్ గ్రంథులు తెరుచుకుంటాయి. దీంతో పిల్లలు ఇతర ఆహార పదార్థాలను కూడా తిని ఎంజాయ్ చేయగలుగుతారు.