గర్భిణులు పుచ్చకాయ తింటే..!
పుచ్చకాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో ఉండే వాటర్ కంటెంట్ డీహైడ్రేషన్ సమస్య రాకుండా కాపాడుతుంది. అయితే గర్భిణులు ఈ పండును తినొచ్చా? లేదా?
గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లితీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. బిడ్డ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి మంచి పోషకాహారం తీసుకోవాలి. ఇకపోతే ఎండాకాలంలో పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని ఎవ్వరైనా తినొచ్చు. గర్బిణులు ఈ పండ్లను తింటే వారి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయలో ముఖ్యమైన కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. అలాగే ఈ పండులో 91 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది ఆర్ద్రీకరణను నిర్వహించడానికి సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు రావడం సర్వ సాధారణం. అయితే పుచ్చకాయను తింటే గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 6, పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి.
దీనిలో ఉండే మెగ్నీషియం కండరాలను సడలించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది గర్భధారణ సమయంలో అకాల సంకోచాలను నివారిస్తుంది. అలాగే పుచ్చకాయ గుండెల్లో మంటను తగ్గిస్తుంది. నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. దీనిలో లైకోపీన్, లుటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. ఇది అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో పోరాడటానికి మీ శరీరానికి ఎంతగానో సహాయపడుతుంది.
పుచ్చకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముందస్తు ప్రసవంతో సహా గర్భధారణ వల్ల కలిగే సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో పుచ్చకాయను తినడం వల్ల ప్రీక్లాంప్సియా ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
పుచ్చకాయలో ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, విటమిన్లు, మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. పుచ్చకాయలో 91% ఆర్ద్రీకరణ ఉంటుంది. కాబట్టి ఇది గర్భిణీ స్త్రీలు హైడ్రేట్ గా ఉండటానికి, వికారాన్ని నివారించడానికి సహాయపడుతుంది. పుచ్చకాయను ఎప్పటికప్పుడు తినడం వల్ల గర్భిణులకు ఎంతో మేలు జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు పుచ్చకాయ రసం, స్మూతీ లేదా ముక్కలుగా చేసుకుని తినొచ్చు.