పిల్లల ముందు పేరెంట్స్ బట్టలు మార్చుకోవచ్చా?
పేరెంట్స్ పిల్లల ముందు కొన్ని పనులు చేయకూడదట. మరి, ఎలాంటి పనులు పేరెంట్స్ పిల్లల ముందు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....

ప్రతి పేరెంట్స్... తమ పిల్లలకు ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలంటే వారికి చిన్నతనం నుంచే చాలా విషయాలు నేర్పించాలి. ఈ రెండు విషయాల్లో పిల్లలు టాప్ లో ఉంటే.. వారికి తిరుగు అనేది ఉండదు. అయితే.. పిల్లలు మంచి వ్యక్తిగా ఎదగడానికి సహాయపడే కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల ముందు కొన్ని పనులు చేయకూడదట. మరి, ఎలాంటి పనులు పేరెంట్స్ పిల్లల ముందు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....
parents
1.బట్టలు మార్చుకోవడం....
ఎంత చిన్నవారైనా సరే పిల్లల ముందు పేరెంట్స్ దుస్తులు మార్ుకోకూడదట. ముఖ్యంగా 2 సంవత్సరాలు నిండిన పిల్లల ముందు అస్సలు మార్చుకోకూడదు. ఎందుకంటే.. రెండేళ్ల వయసు నుంచి పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకోవడం, చూసిన వాటిని అనుసరించడం మొదలుపెడతారు. అందుకే.. తల్లి మాత్రమే కాదు.. తండ్రి కూడా పిల్లల ముందు దుస్తులు మార్చుకోకూడదు.
2.చెడు పదాలు వాడటం...
చెడు పదాలను పేరెంట్స్.. పిల్లల ముందు వాడకూడదు. మీరు మీ పిల్లల ముందు చెడు పదాలు ఉపయోగిస్తే, మీ పిల్లలు దానిని సాధారణ పదంగా భావిస్తారు. ఆ పదాలు వాడకూడదు అని వారికి తెలీదు. తెలీకుండానే ఆ పదాలను ఇతరుల ముందు వాడేస్తూ ఉంటారు. అందుకే.. మనం వాడే పదాలు కరెక్ట్ గా ఉండాలి.
parents
3. విమర్శించడం: మనం తరచుగా ఇంటి సభ్యులతో లేదా పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు ఇతరులను విమర్శిస్తాము. ఈ విమర్శ తరచుగా నిర్మాణాత్మకంగా ఉండదు. పిల్లలు అలాంటి విమర్శలను విన్నట్లయితే, వారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. అలాగే, అలాంటి విమర్శ పిల్లలలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి కారణం అవుతుంది.
4.గొడవలు: మీరు ఒక వ్యక్తితో విభేదించవచ్చు. కానీ దాని గురించి గొడవ పడటం మంచి పని కాదు! ఒక పిల్లవాడు చిన్నప్పటి నుండి తగాదాలు, గొడవలు చూస్తూ పెరిగితే, అతని మానసిక అభివృద్ధి ప్రభావితమవుతుంది. అతను చాలా పిరికివాడిగా లేదా చాలా నిర్లక్ష్యంగా పెరుగుతాడు.
parents
5. హింసాత్మక ప్రవర్తన: ఎవరూ హింసను కోరుకోరు. కానీ చాలా కుటుంబాలలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవచ్చు. హింసాత్మక ప్రవర్తనలో భాగంగా చేతులు ఎత్తడం, ఏదైనా కొట్టడం లేదా వాదన సమయంలో కోపంగా ఉండటం వంటివి ఉంటాయి. పిల్లలు చిన్నప్పటి నుండి అలాంటి ప్రవర్తనను చూస్తే వారి మానసిక స్థితి దెబ్బతింటుంది. వారు కూడా ఇతరులతో అలానే ప్రవర్తించే అవకాశం ఉంటుంది.
6. మాదకద్రవ్యాల దుర్వినియోగం: మాదకద్రవ్యాల వాడకం ఎవరికీ మంచిది కాదు. మాదకద్రవ్యాలకు బానిసగా మారితే జీవితంలో ముందుకు వెళ్లేరు. అందుకే.. పేరెంట్స్.. పిల్లల ముందు వాటిని వాడకూడదు. అవిమాత్రమే కాదు...సిగరెట్ కాల్చడం, మందు తాగడం లాంటివి కూడా చేయకూడదు. పిల్లలు కూడా వాటికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది.