Parenting: మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా? జరిగబోయేది ఇదే
పేరెంట్స్ కూడా పిల్లలు ఏడుస్తున్నారని, వారు అన్నం తినడం లేదు అని ఇలా చాలా కారణాల వల్ల పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇలా మొదలై.. వాటికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. కానీ, పిల్లలకు ఇలా ఫోన్లు ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో , నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్ వాడుతున్నారు. అయితే.. ఇంట్లో అందరూ ఫోన్లు వాడటం వల్ల... పిల్లలకు కూడా చిన్నతనం నుంచే ఫోన్లు వాడకం అలవాటు అయిపోతుంది. అంతేనా.. పిల్లలు అసలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. పేరెంట్స్ కూడా పిల్లలు ఏడుస్తున్నారని, వారు అన్నం తినడం లేదు అని ఇలా చాలా కారణాల వల్ల పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇలా మొదలై.. వాటికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. కానీ, పిల్లలకు ఇలా ఫోన్లు ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో , నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
ఇంట్లో ఉండే చంటి పిల్లల దగ్గర నుంచి స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్నారు. చిన్న పిల్లలు అన్నం తినడానికి మారాం చేస్తున్నారని ఫోన్లు ఇస్తుంటే... స్కూల్, కాలేజీకి వెళ్లే పిల్లలు హోం వర్క్, ప్రాజెక్ట్ వర్క్ చేయాలని.. ఫోన్లు రిఫరెన్స్ చూసుకుంటాం అంటూ గంటల కొద్దీ ఆ ఫోన్లతో గడిపేస్తున్నారు. గేమ్స్ ఆడటం కోసం వాడడుతున్నారా లేక.. చదువు కోసం వాడుతున్నారా అనే తేడా లేదు. స్మార్ట్ ఫోన్లు చూడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.
బయట అవుట్ డోర్ గేమ్స్ ఆడాల్సిన పిల్లలు.. ఇంట్లో అదే గేమ్స్ ఫోన్ లో ఆడుతున్నారు. దాని వల్ల పిల్లలకు శారీరకంగా కూడా ఫిట్ గా ఉండలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా 14 నుంచి 16 ఏళ్లలోపు వారిలో 82 శాతం మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారట. దాని వల్ల.. పిల్లలకు కంటి చూపు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల లోపు పిల్లలకు సైట్ వచ్చేస్తోంది. దాని వెనక కారణం ఇదే. ఇది ఎక్కువగా ముదిరిపోతే.. ఏకంగా కంటి చూపు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు.. మానసిక సమస్యలు కూడా వచ్చేస్తాయి. పిల్లలకు చిన్న విషయాలకే కోపం రావడం, మనుషులతో కలవకపోవడం లాంటివి కూడా జరుగుతాయి.
స్మార్ట్ ఫోన్ల కారణంగా దుష్ప్రభావాలు...
స్మార్ట్‌ఫోన్లు పిల్లలపై కొన్ని దుష్ప్రభావాలు చూపించగలవు. ఎక్కువ సమయం ఫోన్ వినియోగం వల్ల చదువుపై దృష్టి తగ్గుతుంది. కంటి సమస్యలు, నిద్రలేమి, అధిక బరువు వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. స్మార్ట్‌ఫోన్లతో అధిక గడపడం వల్ల పిల్లలు ఇతరులతో సమానంగా కలివిడిగా ఉండలేరు, ఇది సామాజిక వేరుదనానికి దారితీస్తుంది. సైబర్ ముప్పులు కూడా పెరుగుతున్నాయి.అపరిచితులతో చాటింగ్, సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంకా, హింసాత్మక గేమ్స్ లేదా అనుచిత కంటెంట్ వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవచ్చు, వారిలో ఆగ్రహం, అసహనం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, పిల్లలు స్మార్ట్‌ఫోన్లను ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి.
తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు:
సమయ పరిమితి: రోజుకు 1-2 గంటలకంటే ఎక్కువగా ఫోన్ వాడనివ్వకండి.
కంటెంట్ మానిటరింగ్: పిల్లలు ఏమి చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి.
విద్యా వాడకానికి ప్రోత్సహించండి: వినోదం కన్నా విద్య, క్రియేటివ్ యాప్‌లను ప్రోత్సహించండి.
ఆఫ్‌లైన్ క్రియాకలాపాలు: ఫోన్ కాకుండా బహిరంగ ఆటలు, చదువు, ఇతర హాబీలపై దృష్టి పెట్టించండి.
సురక్షిత యాప్‌లు: పిల్లల కోసం పేరెంటల్ కంట్రోల్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి.