ప్రెగ్నెన్సీలో ఆందోళన.... ఇంత ప్రమాదమా..?
మనకు తెలీకుండానే... బిడ్డను కడుపులో మోసే క్రమంలో ఎక్కువగా స్త్రీలు ఆందోళనకు గురౌతూ ఉంటారట. ఈ ఆందోళన కారణంగా.... బిడ్డ పుట్టాల్సిన సమయం కన్నా... ముందుగానే అంటే... ప్రీ మెచ్యూర్ డెలివరీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తల్లి అవ్వడం ప్రతి ఒక్క మహిళ జీవితంలో ఓ మధురమైన విషయం. పెళ్లైన ప్రతి మహిళ తల్లిగా మారాలని... తన బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకోవాలి అని సంబరపడుతుంది. అయితే... ఆ అమ్మ అనే పిలుపు అందుకోవడానికి 9 నెలల పాటు తన కడుపులో బిడ్డను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అయితే... మనకు తెలీకుండానే... బిడ్డను కడుపులో మోసే క్రమంలో ఎక్కువగా స్త్రీలు ఆందోళనకు గురౌతూ ఉంటారట. ఈ ఆందోళన కారణంగా.... బిడ్డ పుట్టాల్సిన సమయం కన్నా... ముందుగానే అంటే... ప్రీ మెచ్యూర్ డెలివరీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చేసిన పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
హెల్త్ సైకాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన పరిశోధన ప్రకారం.. ఆందోళన కారణంగా... ముందస్తు జననాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ముందస్తు జననాన్ని నిరోధించడంలో సహాయపడటానికి గర్భధారణ సమయంలో ఆందోళన కోసం ఎప్పుడు, ఎలా అనే విషయాన్ని ముందుగా వైద్యులు అర్థం చేసుకోవాలట.
గర్భిణీ స్త్రీలలో ప్రతి నలుగురిలో ఒకరికి వైద్యపరంగా ఆందోళన లక్షణాలు పెరుగుతున్నాయని పరిశోధనలో తేలడం గమనార్హం. ఆ ఆందోళన ముందస్తు జననానికి లేదా గర్భం దాల్చిన 37 వారాల కన్నా ముందు పుట్టడాన్ని ప్రమాద కరంగా భావిస్తారు.
తాజా అధ్యయనంలో, హెల్తీ బేబీస్ బిఫోర్ బర్త్ స్టడీలో పాల్గొన్న డెన్వర్, లాస్ ఏంజిల్స్‌లోని 196 మంది గర్భిణీ స్త్రీల విభిన్న నమూనా నుండి డేటాను పరిశోధకులు పరిశీలించారు.
వారు వారి గర్భం దాల్చిన మహిళల మొదటి ,మూడవ ట్రెమిస్టర్ లో , మహిళలకు నాలుగు వేర్వేరు రకాలుగా ఆందోళన కలిగించారట. ఎక్కువ మంది మూడో ట్రెమిస్టర్ లో అది కూడా గర్భానికి సంబంధించిన ప్రశ్నలు అడిగిన సమయంలో ఆందోళనకు గురైనట్లు గుర్తించారు. మొదటి ట్రెమిస్టర్ లో ఆందోళన కాస్త తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయినప్పటకీ... మొదటి, మూడో ట్రెమిస్టర్ లో ఎప్పుడు ఆందోళనకు గురైనా... ప్రీ మెచ్యూర్ డెలివరీలు జరిగే ప్రమాదం ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
గర్భధారణ ప్రారంభంలో సాధారణ ఆందోళన, వైద్యపరమైన ప్రమాదాలు, శిశువు, ప్రసవం, సంతాన సాఫల్యం వంటి సమస్యల గురించి గర్భం దాల్చిన తర్వాత మహిళలు ఆందోళన చెందడానికి దారితీస్తుందని పరిశోధకులు గుర్తించారు.
మహిళలు సాధారణంగా డిప్రెషన్‌ను పరీక్షించినట్లుగానే గర్భధారణ ప్రారంభంలో సాధారణ ఆందోళన కోసం వైద్యులు పరీక్షించాలని అధ్యయనాలు చెబుతున్నాయి