పిల్లలను ఫోన్, టీవీలకు దూరం చేయాలా..? ఇలా చేయండి..!
ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. మా పిల్లలను ఆ ఫోన్ ఎడిక్షన్ నుంచి డైవర్ట్ చేయలేకపోతున్నాం అని ఫిర్యాదు చేస్తున్నారు. మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఈ కింది ట్రిక్స్ తో మనం పిల్లలను టీవీలు, ఫోన్ లకు దూరం చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఈ రోజుల్లో పిల్లలు చాలా షార్ప్ గా ఉన్నారు. టెక్నాలజీ మీద వారికి ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. మనం నేర్పకపోయినా వారికి ఫోన్ లో గేమ్స్ ఆడటం, వీడియోల పెట్టుకోవడం చాలా ఈ జీగా నేర్చేసుకుంటున్నారు. నేర్చుకోవడం మంచిదే కానీ.. ఆ ఫోన్లు చూస్తూ. వాటికి బానిసలుగా మారిపోతున్నారు. గంటలు గంటలుగా ఆ ఫోన్లు , వీడియో గేమ్స్, ట్యాబ్స్ చూస్తూ గడిపేస్తున్నారు. కనీసం ప్లేట్ లో ఫుడ్ నోట్లోకి పోవాలన్నా ఈ కాలం పిల్లలకు ఫోన్, టీవీ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. మా పిల్లలను ఆ ఫోన్ ఎడిక్షన్ నుంచి డైవర్ట్ చేయలేకపోతున్నాం అని ఫిర్యాదు చేస్తున్నారు. మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఈ కింది ట్రిక్స్ తో మనం పిల్లలను టీవీలు, ఫోన్ లకు దూరం చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
నిజానికి పిల్లలు రోజులో కాసేపు టీవీలు చూస్తే తప్పులేదు. వాటి వల్ల వారికి లోకంలోని చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ.. మరీ ఎక్కువగా చూస్తే మాత్రం పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి.. కొన్ని పనులతో పిల్లలను ఎంగేజ్ చేయడం వల్ల.. వారు ఈ ఫోన్, టీవీలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది.
పిల్లలకు డ్రాయింగ్, కలరింగ్ వంటి ఆర్ట్ వర్క్ చాలా నచ్చుతాయి. కాబట్టి.. అలాంటి వాటిపై వారి ఆసక్తిని మరింత పెంచడం వల్ల వారు కాసేపు ఆ ఫోన్, టీవీలకు దూరంగా ఉంటారు. అయితే.. జనరల్ గా వారిని పెయింటింగ్, డ్రాయింగ్ వేసుకోండి అని చెప్పడం కాకుండా.. మీరు దగ్గరుండి వారితో వేయించడం, పేపర్ క్రాఫ్ట్స్ చేయించాలి. అప్పుడు వారు ఫోన్, టీవీలకు దూరమౌతారు.
mother and toddler love emotional viral
రోజంతా పెయింటింగ్ వేయడం, కలరింగ్ చేయడం అంటే పిల్లలకు నచ్చదు. కాసేపు చేసి మళ్లీ ఫోన్ వైపు మల్లుతారు. కాబట్టి.. అలా కాకుండా ఉండాలంటే.. వారికి కుకింగ్ కూడామీరు నేర్పవచ్చు. చిన్న పిల్లలకు కుకింగ్ ఏంటి అని అనుకోవచ్చు.. అంటే కేక్స్ చేయడం.. చిన్న చిన్న పనులు.. మిక్సింగ్ చేయడం, బేకింగ్ చేయడం లాంటివి నేర్పించడం మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల..వారికి ఒక డైవర్షన్ వస్తుంది. అంతేకాకుండా.. వారే స్వయంగా వంట చేయడంలో చేతులు పెట్టడం వల్ల.. తినడానికి కూడా ఆసక్తి పెంచుకుంటారు.
ఇవి కాకుండా.. కాసేపు పిల్లల మైండ్ కి పదునుపెట్టే ఆటలు ఆడించవచ్చు. మీరు ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచి.. వాటిని మీ పిల్లలకు చెప్పి.. ఎక్కడ ఉన్నాయో వెతకమని చెప్పాలి. ఇలా కాసేపు ఆడించవచ్చు. వారికి ఆ వస్తువులు తెలుస్తాయి. అదొక ఆటోలా భావించే అవకాశం ఉంటుంది.
ఇంట్లోనే కొన్ని బోర్డ్ గేమ్స్ ఆడించవచ్చు. మీరు కూడా వారితో కలిసి క్యారమ్స్, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్ వంటి ఆటలు ఆడించాలి. మీరు కూడా వారితో కలిసి సరదాగా ఆడుకోవడం మంచిది.
Image: Getty Images
పిల్లలకు ఎప్పుడూ ఆటలే కాకుండా.. చదవడంపై కూడా ఆసక్తి పెంచాలి. మీరూ కూడా వారితో కలిసి పుస్తకాలు చదివితే.. వారు కూడా అలవాటు చేసుకోవాలి. ఇది వారికి చాలా మంచి చేస్తుంది.
ఇక.. పిల్లలను శారీరకంగా ఫిట్ గా ఉంచడం కూడా చాలా ముఖ్యం. దాని కోసం వారితో చిన్నపాటి వ్యాయామాలు చేయించవచ్చు. అంటే డంబుల్స్ ఎత్తడం లాంటివి కాదు.. జంపింగ్ జాక్స్, స్క్వాట్స్ లాంటివి చేయించవచ్చు. వీటి వల్ల వారి బాడీ ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.
మీకు తెలిసినవి ఇంట్లోనే కొన్ని ప్రయోగాలు తెలిసి ఉండొచ్చు. అలాంటి సైన్స్ ప్రయోగాలు మీరు చేస్తూ వారికి చూపించడమో... లేదంటే.. పిల్లలతో చేపించడమో చేయాలి. వీటి వల్ల.. వారిలో ఉత్సాహం పెరుగుతుంది.
ఇక.. ఇంట్లో చిన్నపాటి క్లీనింగ్ పనులు చేయించడంతో పాటు.. గార్డెనింగ్ లాంటివి కూడా చేయించాలి. విత్తనాలు నాటడం, లేదంటే మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం లాంటివి పిల్లలతో చేయించాలి. ఈ పనులన్నీ చేయించడం వల్ల.. మీరు మీ పిల్లలను టీవీ, ఫోన్ లకు దూరం చేయవచ్చు.