సమ్మర్ లో పిల్లలను ఎంగేజ్ చేయడమెలా..?
ఇప్పటి నుంచే సమ్మర్ హాలీడేస్ టెన్షన్ పేరెంట్స్ లో మొదలయ్యే ఉంటుంది. అయితే.. ఈ కింది పనులు చేయించడం వల్ల.. మీరు పిల్లలను టీవీలకు అతుక్కోకుండా, మీకు తిప్పలు పెట్టకుండా వాళ్లు బిజీగా మారతారు. మరి ఆ పనులేంటో ఓసారి చూద్దాం...
దాదాపు స్కూల్లు అయిపోవచ్చాయి. ఇంకో పది, పదిహేను రోజులు ఆగితే అన్ని స్కూళ్లకు సెలవలు ఇచ్చేస్తారు. ఇన్ని రోజులంటే పిల్లలు స్కూల్స్ కి వెళ్లిపోయారు కాబట్టి... పేరెంట్స్ కాస్త ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారు. కానీ.. సమ్మర్ హాలీడే వస్తే దాదాపు నెల, రెండు నెలలు ఇంట్లోనే ఉంటారు. ఆ సమయంలో ఇల్లు పీకి పందిరేస్తారు. అంతేకాదు.. గంటల కొద్దీ టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పటి నుంచే సమ్మర్ హాలీడేస్ టెన్షన్ పేరెంట్స్ లో మొదలయ్యే ఉంటుంది. అయితే.. ఈ కింది పనులు చేయించడం వల్ల.. మీరు పిల్లలను టీవీలకు అతుక్కోకుండా, మీకు తిప్పలు పెట్టకుండా వాళ్లు బిజీగా మారతారు. మరి ఆ పనులేంటో ఓసారి చూద్దాం...
1.గేమ్స్..
సమ్మర్ రాగానే... దాదాపు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో స్కూల్ వాళ్లే సమ్మర్ క్యాంప్స్ పెడుతున్నారు. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సమ్మర్ క్యాంప్ లో పిల్లలను చేర్పించవచ్చు. చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి.. టైమ్ పాస్ బాగా అవుతుంది. అక్కడ ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదీ కాదు అంటే.. సమ్మర్ కి సూట్ అయ్యే ఏదో ఒక గేమ్స్ లో చేర్పించండి. రోజంతా కాకపోయినా కనీసం రెండు, గంటలు ఆ గేమ్ లో ఎంగేజ్ అవుతారు. ఆ గేమ్ ఆడటం వల్ల అసలిపోయి కాసేపు అల్లరి చేయకుండా రెస్ట్ తీసుకుంటారు. అవుట్ డోర్ గేమ్స్ ఎండలో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇండోర్ గేమ్స్ లో కూడా చేర్పించవచ్చు. గేమ్స్ వల్ల పిల్లలు శారీరకంగా ఫిట్ గా కూడా ఉంటారు.
2.బుక్ రీడింగ్..
పిల్లలను శారీరంగా ఫిట్ గా ఉంచడమే కాదు.. మానసికంగానూ స్ట్రాంగ్ గా ఉంచే ప్రయత్నం చేయాలి. దాని కోసం మారి మానసిక ఉల్లాసం పెంపొందించడడానికి మంచి పుస్తకాలు చదివించాలి. బుక్ రీడింగ్ చాలా మంచి అలవాటు. దానివైపు పిల్లల ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించడం చాలా మంచిది. దీనిపై మీరు ఫోకస్ పెట్టండి. వారికి ఆసక్తి కలిగించేలాంటి పుస్తకాలు కొని ఇవ్వండి.
3.వాకింగ్..
ఇప్పుడంటే పిల్లలు రోజూ స్కూల్ కి వెళ్తుంటారు కాబట్టి.. ఉదయం లేవడం, హడావిడిగా తయారవ్వడం, తినీ తినక స్కూల్ కి పరిగెత్తడం చేస్తూ ఉంటారు. సమ్మర్ హాలీడేస్ వచ్చిన తర్వాత ఆ హడావిడి ఉండదు. కాబట్టి.. ప్రశాంతంగా ఉదయాన్నే వారిని లేపి.. చక్కగా నేచర్ లో వాకింగ్ కి తీసుకువెళ్లండి. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు. చుట్టూ పరిసరాలు తెలుసుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
4.గార్డెనింగ్..
పిల్లలకు గార్డెనింగ్ నేర్పించండి. మీ ఇంటి పెరట్లో మెక్కలను పెంచడం, విత్తనాలు వేయడం, నీళ్లు పట్టడం లాంటి పనులు చేయంచండి. పెరడు లేకపోతే.. బాల్కనీలో కుండీలు పెట్టడం, నర్సరీకి తీసుకువెళ్లడం లాంటివి చేసి, గార్డెనింగ్ పట్ల వారి ఆసక్తిని పెంచే ప్రయత్నం చేయండి.
5.రూమ్ ఆర్గనైజింగ్..
ఇంట్లో బొమ్మలు లేకుండా పిల్లలు ఎవరూ ఉండరు. అయితే పిల్లలు బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. వాటిని పేరెంట్స్ సర్దుతూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి.. ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉంటారు కాబట్టి.. ఆ బొమ్మలను వారితోనే సర్దించే పని పట్టాలి. ఇలా వారికి రూమ్ ఆర్గనైజింగ్ తెలుస్తుంది.
6.కుకింగ్..
దాదాపు పిల్లలు అందరికీ కుకింగ్ పట్ల ఆసక్తి ఉంటుంది. తమకు ఇష్టమైన ఫుడ్ పేరెంట్స్ చేసేటప్పుడు దానిని చూడాలని చాలా ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి.. ఈ సమ్మర్ హాలీడేస్ లో చిన్న చిన్న వంటలు చేయడం నేర్పించాలి. వారికి ఎలాంటి గాయాలు కాకుండా చూసుకుంటూ దగ్గరుండి వారితో వంట చేపించాలి. అంటే మిల్క్ షేక్, సలాడ్, స్మూతీస్, ఫ్రూట్ జ్యూస్ లాంటివి చేయడం నేర్పించాలి.
online summer camp
7. క్రాఫ్ట్..
వీటితోపాటు పేపర్ క్రాఫ్టింగ్ , లేదంటే ఏదైనా కొత్త స్కిల్స్ వారికి నేర్పించాలి. కొత్తవి నేర్చుకోవడంలో పిల్లలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు కాబట్టి వాటిని నేర్పించడం వారికి కూడా నచ్చుతుంది.