మగ పిల్లలకు తల్లి అవసరం ఎప్పుడు వస్తుందో తెలుసా?
ముఖ్యంగా ఏడు సందర్భాల్లో వారు.. ఎంత మంది ఉన్నా.. కేవలం వాళ్ల అమ్మ మాత్రమే ఉండాలని అనుకుంటారట. అలాంటి సందర్భాలేంటో చూద్దాం…
new mom
ప్రతి పిల్లలకు తల్లి అవసరం. తల్లి ప్రేమను ప్రపంచంలో మరెవరూ భర్తీ చేయలేరు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ… చాలా మంది ఆడపిల్లలకు మాత్రమే తల్లి అవసరం ఎక్కువగా ఉంటుందని.. మగ పిల్లలకు పెద్దగా అవసరం ఉండదు అని చెబుతూ ఉంటారు. కానీ.. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలుకి కూడా తల్లి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏడు సందర్భాల్లో వారు.. ఎంత మంది ఉన్నా.. కేవలం వాళ్ల అమ్మ మాత్రమే ఉండాలని అనుకుంటారట. అలాంటి సందర్భాలేంటో చూద్దాం…
kids health
మన చుట్టూ ఉన్నవారందరూ ఎంత ప్రేమ చూపించినా.. అది తల్లి ప్రేమ కు సాటిరాదు. తల్లి ప్రేమను పిల్లలు ఎక్కువగా ఆస్వాదించగలరు. తమకు ఎలాంటి కష్టం వచ్చినా దానిని అమ్మ మాత్రమే తీర్చగలదని పిల్లలు నమ్ముతారు.
kids health
ఇక.. మగ పిల్లలకు బాగా ఆకలివేసినప్పుడు వారికి మొదట గుర్తుకు వచ్చేది అమ్మ. ముఖ్యంగా చిన్నతనంలో వాళ్లు.. అమ్మ చేసిన వంటను మాత్రమే ఇష్టపడతారు. ఇతరులు చేసిన ఆహారాన్ని పెద్దగా తినడానికి ఇష్టపడరు. అందుకే వారికి ఆకలి వేసినప్పుడు వెంటనే అమ్మ గుర్తుకువస్తుంది. అమ్మ అవసరం అవుతుంది.
ఇక.. తండ్రి ఎంత క్లోజ్ గా ఉన్నా మగపిల్లలు చాలా విషయాలు నాన్నతో పంచుకోరట. ముఖ్యంగా ఎమోషనల్ బాండింగ్ వారికి తల్లితోనే ఎక్కువ ఉంటుంది. వారికి బాధ అనిపించినప్పుడు కచ్చితంగా పక్కన అమ్మ ఉంటే బాగుండు అని కోరుకుంటారట.
తమ జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో, ముఖ్యంగా పుట్టిన రోజు సమయంలో తల్లి ఉంటే బాగుండు అని పిల్లలు కోరుకుంటారట. తమ పుట్టిన రోజు నాడు తల్లి తమ కోసం చేసే చిన్న చిన్న పనులను కూడా పిల్లలు ఇష్టపడతారు. అలాంటి సమయంలో అమ్మ పక్కనే ఉంటే బాగుండు అని అనుకుంటారట.
పిల్లలకు హోం వర్క్ లు చేయడం పెద్ద టాస్క్. కానీ… అమ్మ పక్కనే ఉండి హెల్ప్ చేస్తే చాలా హాయిగా అయిపోతుంది. అందుకే మగ పిల్లలు హోం వర్క్ లు చేసే సమయంలో అమ్మ ఉండాలని అనుకుంటారట.
తమ షర్ట్ బటన్ ఊడిపోయినా, ఇంట్లో ఏదైనా వస్తువు కనిపించకపోయినా.. ముందుగా నోటి నుంచి వచ్చేది అమ్మ పేరే. అమ్మ ఉంటే… ఇలాంటి వాటికి వెంటనే పరిష్కారం చూపిస్తుందని మగ పిల్లలు భావిస్తారట.
జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో, చిన్నప్పటి స్నేహాలు, బంధాలు.. ఇలా దేని గురించి అయినా మగ పిల్లలు తల్లిదగ్గరే డెసిషన్ తీసుకోవాలని అనుకుంటారట. వీటన్నింటిలోనూ వీరికి తల్లి అవసరం పక్కగా ఉంటుందట.