పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు
తల్లిదండ్రులను చూస్తూనే పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. అయితే పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని తల్లిదండ్రులు చాలా తప్పులు చేస్తుంటారు. కానీ వీటివల్ల మీ పిల్లల భవిష్యత్తు ఎలా అవుతుందో తెలుసా?
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతో కష్టపడతారు. వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఎంతటి కష్టమైనా చేస్తారు. అయితే పిల్లల్ని బాగా పెంచాలనే ఉద్దేశంతో చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు.
కానీ ఈ తప్పులు పిల్లల భవిష్యత్తుపై చెడు ప్రభావాన్ని చూపుతాయన్న విషయాన్ని పేరెంట్స్ గ్రహించరు. ప్రతి పేరెంట్స్ తమ పిల్లల ముందు ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాలను పట్టించుకోరు. అందుకే మీరు మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకుంటే.. వారి ముందు మీరు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లల పెంపకం చిట్కాలు
పెద్దలను అగౌరవపరచకూడదు
చాలా మంది పిల్లలు పెద్దలను అస్సలు గౌరవించరు. ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. కానీ మీ పిల్లలు ఇలా కాకూడదంటే మాత్రం మీరు కూడా మీ పిల్లల ముందు పెద్దలను గౌరవించండి. అలాగే వారితో మర్యాదగా మాట్లాడండి. అలాగే చిన్నవారితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడండి. అప్పుడే సంబంధాలు, భావాలు ఎంత ముఖ్యమో మీ పిల్లలు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని చూసి వారు కూడా అలాగే అవుతారు.
శ్రద్ధగా వినండి
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పే విషయాన్ని అస్సలు వినరు. వారు చెప్తాన్నా.. తల్లిదండ్రులు కనీసం వినకుండా తమ పని వారు చేసుకుంటుంటారు. కానీ ఇలా అస్సలు ప్రవర్తించకూడదు. పిల్లలు ఏది చెప్పినా శ్రద్ధగా వినండి. అలాగే వారికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. వారు మాట్లాడటం పూర్తైన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. పిల్లల చెప్పే మాటలను సిల్లీగా తీసి పారేయకండి.
ఇలాంటి పదాలు వాడకండి
పిల్లలు తప్పు చేస్తే చాలు తల్లిదండ్రులు ఇంతింత గొంతేసుకుని పిల్లలపై అరుస్తుంటారు. వారిని తిడుతుంటారు. ముఖ్యంగా పిచ్చోడా, తెలివిలేదా అంటూ చాలా పదాలతో తిడుతుంటారు. కానీ ఇలా తిట్టడం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మీ పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలా మీరు పదే పదే తిడితే నిజమేనని అనుకుంటాడు. దీంతో వారిని వారు తక్కువగా అంచనా వేసుకుంటాడు. ఇది మీ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అందుకే మీ పిల్లలను ఇలా తిట్టడం మానుకోండి.
అతిగా నియంత్రించొద్దు
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా కంట్రోల్ చేస్తారు. కానీ ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అలాగే వారు స్వతంగా ఏ నిర్ణయం తీసుకోలేరు. అందుకే తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే చేయనివ్వండి. వారు చేసేది తప్పని అనిపిస్తే తర్వాత చెప్పండి. కానీ మధ్యలో ఆపకండి.
ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్ చూడొద్దు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దని, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినకూడదని ఇలా ఎన్నో మంచి మాటలు చెప్తారు. కానీ వాళ్లు మాత్రం చేయరు. పిల్లల్ని ముందు పెట్టుకునే ఫోన్ ను గంటలకు గంటలు చూస్తుంటారు.
మీ పిల్లలు ఫోన్ చూడకూడదంటే మాత్రం మీరు వారిముందు ఫోన్ చూడటం మానేయండి. అలాగే మీ పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినకూడదంటే ముందు మీరు తినడం మానేయండి.
పిల్లల పెంపకం
కాబట్టి మీ పిల్లల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో, ఏం ఆశిస్తున్నారో ముందుగా అవి మేరే చేయండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. పిల్లలు మంచైనా, చెడైనా తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారని మర్చిపోకండి.