పిల్లలు హెల్దీ ఫుడ్ తినాలంటే ఏం చేయాలో తెలుసా?
మా పిల్లలు ఎంత తినిపిద్దాం అన్నా కూడా... పండ్లు, కూరగాయలు తినరు అని చాలా మంది పేరెంట్స్ చెబుతూ ఉంటారు. అయితే.. ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.. మీరు పిల్లలతో ఆరోగ్యకరమైన ఆహారం తినిపించొచ్చు.

10 ways to build healthy Eating habits in Kids
ఈరోజుల్లో పిల్లలు తిండి తినడానికే తెగ మారాం చేస్తుంటారు. ఇక.. ఆరోగ్యకరమైన ఫుడ్ తినిపించాలి అంటే మరింత తిప్పలు పడాల్సిందే. అదే జంక్ ఫుడ్ అయితే.. వెంటనే వాటికి ఎట్రాక్ట్ అయిపోయి వాటిని తినేస్తూ ఉంటారు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి, పిల్లలు హెల్దీ ఫుడ్ తినాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లల ఆరోగ్యం వారు తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ వారికి సరైన పోషకాలు అందేలా ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. మా పిల్లలు ఎంత తినిపిద్దాం అన్నా కూడా... పండ్లు, కూరగాయలు తినరు అని చాలా మంది పేరెంట్స్ చెబుతూ ఉంటారు. అయితే.. ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.. మీరు పిల్లలతో ఆరోగ్యకరమైన ఆహారం తినిపించొచ్చు.
kids eating
మీరు తినడం అలవాటు చేసుకోండి...
పిల్లలు దాదాపు ఎక్కువ విషయాలు తమ పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. మీరు తినే వాటినే వారు కూడా తినాలి అనుకుంటూ ఉంటారు. కాబట్టి.. మీరు వారికి మంచి ఉదాహరణగా నిలవాలి. మీరు హెల్దీ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకుంటే.. వారు కూడా హెల్దీ ఫుడ్ తినడం అలవాటు అవుతుంది.
పిల్లలకు నచ్చేలా...
ఎలాంటి హెల్దీ ఫుడ్ అయినా దానిని పిల్లలకు నచ్చేలా, కలర్ ఫుల్ గా ఇవ్వడానికి ప్రయత్నించాలి. డిఫరెంట్ షేపుల్లో కట్ చేయడం లాంటివి చేయడం వల్ల పిల్లలకు నచ్చేలా చేయవచ్చు.
kids eating
వివిధ రకాల ఆహారాలను పరిచయం చేయండి
వివిధ రకాల పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలను పరిచయం చేయడం ద్వారా పిల్లలు కొత్త రుచులను అన్వేషించడానికి ప్రోత్సహించండి. విభిన్న ఎంపికలను అందించడం భోజనాన్ని ఉత్తేజకరంగా ఉంచుతుంది . పోషకమైన ఆహారాల పట్ల అభిరుచిని పెంపొందించడానికి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడానికి సహాయపడుతుంది.
పిల్లలను కూడా భాగం చేయాలి...
మనం ఆహారం తయారు చేసే సమయంలో.. వాటికి దుకాణం తెచ్చే విషయంలో కూడా పిల్లలను భాగం చేయాలి. ఇలా చేయడం వల్ల.. వాటి తయారీ, తినే విషయంలో వారికి క్యూరియాసిటీ పెరుగుతుంది. తినడానికి ఆసక్తి చూపిస్తారు.
ఒకే సమయానికి ఆహారం...
పిల్లలకు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదు. రోజూ ఒకే సమయానికి ఆహారం ఇవ్వడం అలవాటు చేయాలి. అది భోజనం అయినా, స్నాక్స్ అయినా సరే.. ఒకే సమయానికి ఇవ్వడం అలవాటు చేయాలి. దీని వల్ల.. వారికి అదే సమయానికి ఆకలి అవుతుంది. అన్ హెల్దీ ఫుడ్స్ జోలికి వెళ్లే అవకకాశం చాలా తక్కువగా ఉంటుంది.
కొద్ది కొద్దిగా పెట్టండి...
పిల్లలకు భోజనం ప్లేటులో నిండా పెట్టేయకూడదు. కొద్ది కొద్దిగా వడ్డించాలి. పిల్లలు ఇంకా ఆకలితో ఉంటే వారు ఎక్కువ అడగడానికి వీలు కల్పిస్తుంది. ఈ విధానం అతిగా తినడం నిరోధించడంలో సహాయపడుతుంది, బుద్ధిపూర్వకంగా తినడాన్ని ప్రోత్సహిస్తుంది. పిల్లలు వారి ఆకలి సంకేతాలను గుర్తించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మరియు ఆహారంతో సమతుల్య సంబంధాన్ని పెంపొందించడం నేర్పుతుంది.
ప్రాసెస్ చేసిన , చక్కెర కలిగిన ఆహారాలను పరిమితం చేయండి
తాజా పండ్లు, పెరుగు , గింజలు వంటి పోషకమైన ప్రత్యామ్నాయాల కోసం అనారోగ్యకరమైన స్నాక్స్‌ను క్రమంగా మార్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించండి. ఈ సున్నితమైన మార్పు పిల్లలు కాలక్రమేణా ప్రాసెస్ చేసిన , చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోవడం తగ్గిస్తూ ఆరోగ్యకరమైన ఎంపికల పట్ల ప్రాధాన్యతను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది.
పోషకాహారం గురించి అవగాహన కల్పించండి
పోషకాహార ఆహారాలు పెరుగుదలకు ఎలా శక్తినిస్తాయో, శక్తిని ఎలా పెంచుతాయో, మొత్తం శ్రేయస్సును ఎలా మెరుగుపరుస్తాయో పిల్లలకు అవగాహన కల్పించండి. ఎందుకు హెల్దీ ఫుడ్ తినాలో తెలిస్తే కూడా వారు తినే అవకాశం ఉంటుంది.