పెళ్లికాని మహిళలు పబ్లిక్ ప్రాపర్టీయే : జకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు
మహిళల గురించి చాలా దారుణంగా మాట్లాడి మరో వివాదానికి తెరతీసారు ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్. ఇంతకూ అతడు మహిళల గురించి ఏమన్నారంటే...
Zakir Naik
వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు జాకీర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. వివాహమైనా మగాడిని మహిళలు పెళ్లాడటం ఏమాత్రం తప్పు కాదనేలా ఆయన మాట్లాడారు. ఒకవేళ మహిళ పెళ్లి చేసుకోకుండా అలాగే వుంటే బజారు మనిషిలా మిగిలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలా మహిళలను కించపర్చేలా మాట్లాడి మరో వివాదానికి తెర తీసారు జాకీర్ నాయక్.
Zakir Naik
మనీ లాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో జకీర్ నాయక్ పై చర్యలకు సిద్దమైంది భారత ప్రభుత్వం. దీంతో 2016లో ఇండియాను విడిచిపెట్టి మలేషియాకు మకాం మార్చారు. గత ఎనిమిదేళ్లుగా అతడు ఒక్కసారి కూడా ఇండియాలో అడుగుపెట్టలేదు. అయితే తీవ్ర అభియోగాల నేపథ్యంలో జకీర్ ను ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇదిలావుంటే ప్రస్తుతం జకీర్ నాయక్ పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశంలోని కీలక నగరాలు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Zakir Naik
జకీర్ నాయక్ ఏమన్నారంటే :
ఇస్లాం మతం ఓ పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మహిళలను పెళ్లాడేందుకు అనుమతిస్తుంది. అంటే అప్పటికే పెళ్లయి భార్య వున్న పురుషుడు మరో మహిళను ఇష్టపడవచ్చు... పెళ్లాడి సంతానాన్ని కూడా పొందవచ్చు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఈ సాంప్రదాయం తప్పేమీ కాదనేలా కామెంట్ చేసారు.
పెళ్లికాని స్త్రీకి సమాజంలో గౌరవించలేరని నాయక్ పేర్కొన్నారు. పెళ్లి చేసుకోడానికి అబ్బాయి దొరక్కుంటే ఆ అమ్మాయి ముదు రెండు దారులు వుంటాయి... ఒకటి పెళ్లిచేసుకోకుండా మిగిలిపోవడం...రెండోది పెళ్లయిన వ్యక్తిని వివాహం చేసుకోవడం. అయితే ఇందులో పెళ్లి చేసుకోకుండా వుండిపోవడం కంటే పెళ్లయిన వ్యక్తికి భార్యగా వెళ్లడమే మంచిది... దీంతో ఆమెకు గౌరవం పెరుగుతుందని జాకీర్ నాయక్ పేర్కొన్నారు.
అయితే పెళ్లి చేసుకోకుండా వుండిపోయేవాళ్లు 'బజారు ఔరత్'(బజారు మహిళ) మిగిలిపోతారంటూ జకీర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పెళ్ళి కాని మహిళలు పబ్లిక్ ప్రాపర్టీగా అతడు పేర్కొన్నారు. రెండో పెళ్లో లేక మూడో పెళ్లో... పురుషుడితో వుంటేనే మహిళకు గౌరవమని సంచలన వ్యాఖ్యలు చేసారు. కాబట్టి గౌరవప్రదమైన స్ లు పెళ్లి చేసుకోడానికే ఇష్టపడతారని జకీర్ నాయక్ అన్నారు.
Zakir Naik
జకీర్ నాయక్ వ్యాఖ్యలపై దుమారం :
మహిళలు, వివాహ వ్యవస్థపై జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి... అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక శాతం నెటిజన్లు నాయక్ వ్యాఖ్యల స్త్రీలపై ఆయనకున్న ద్వేషాన్ని తెలియజేస్తాయని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళల హక్కులకు హానికరమైనవిగా పేర్కొంటున్నారు. మరికొందరు పాకిస్తాన్ ఇలాంటి ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు.
ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తిని వివాహం చేసుకోకపోతే పెళ్లికాని స్త్రీని గౌరవించలేదని జకీర్ నాయక్ అంటున్నాడు. లేదంటే ఆమె బజారు మనిషిగా మారుతుందని అంటున్నాడు.. ఇది మధ్యయుగ ఆలోచనా విధానం. ఇలాంటి వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమైనవి, భయంకరమైనవి. ఇలాంటి వ్యాఖ్యలను పాకిస్థాన్ సమర్దించడం దారుణమని నెటిజన్లు అంటున్నారు.
ఈ వివిదాస్పద చర్చలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ప్రస్తావించబడింది. జాకీర్ నాయక్ భారతదేశంలో అలాంటి అభిప్రాయాలను వ్యాప్తి చేయకుండా చూసుకున్నందుకు చాలా మంది ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం ఎప్పటికీ జకీర్ నాయక్ నుదేశానికి తిరిగి రాకుండా నిషేధించాలని నెటిజన్లు కోరుతున్నారు.