భర్తతో విడాకులు.. రెండేళ్లుగా మరో వ్యక్తితో రిలేషన్.. అతడికి మరో మహిళతో ఎఫైర్ ఉందని తెలియడంతో..
ఓ మహిళకు అప్పటికే పెళ్లైంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అయితే అతడు మరో మహిళతో ఎఫైర్ మొదలుపెట్టాడని తెలియడంతో ఆమె మనస్తాపానికి గురైంది.
ఓ మహిళకు అప్పటికే పెళ్లైంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అయితే అతడు మరో మహిళతో ఎఫైర్ మొదలుపెట్టాడని తెలియడంతో ఆమె మనస్తాపానికి గురైంది. అదే సమయంలో తనను దూరం పెట్టడంపై ఒకింత ఆవేదన చెందింది. ఈ క్రమంలోనే ప్రియుడిని కత్తితో పొడిచి చంపేందుకు యత్నించింది.
ఈ షాకింగ్ బెంగళూరులోని వివేక్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. అస్సాంకు చెందిన 36 ఏళ్ల జింటూ దాస్‌కు ఇదివరకే పెళ్లి జరిగింది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. అయితే మూడేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది.
అయితే ప్రస్తతం బెంగళూరులో ఉంటున్న జింటూ దాస్ తన 16 ఏళ్ల కుమార్తెతో కలిసి జిగానిలో డేకేర్ సెంటర్‌లో పనిచేస్తోంది. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో వాచ్‌మెన్ అయిన జోగేష్‌కు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా 2021లో జింటూ దాస్‌తో పరిచయం అయింది. ఇది కాస్తా వారి మధ్య రిలేషన్‌కు దారితీసింది.
Murder case
జింటూ దాస్, జోగేష్‌లు రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ సమయంలో జింటూ జోగేష్‌కు ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. అయితే గత నెలరోజులుగా ఆర్థిక విషయాలపై వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. మరోవైపు జోగేష్ మరొక మహిళను చూడటం ప్రారంభించాడు. జింటూ దాస్‌ను తప్పించడం ప్రారంభించాడు.
ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోయిన జింటూ దాస్ ఆగ్రహంతో రగిలిపోతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో జింటూ దాస్.. జోగేష్‌ను కత్తితో పొడిచింది. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయ్యింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు జోగేష్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన జోగేష్‌కు ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది. ఈ ఘటన అనంతరం జింటూ అస్సాంకు పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను విల్సన్ గార్డెన్‌లోని బంధువుల ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వివేకనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఆమె జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జింటూ దాస్‌తో పాటు జోగేష్‌కు అస్సాంకు చెందిన వ్యక్తేనని చెప్పారు.