- Home
- National
- నమ్మి వచ్చిన ప్రియుడి నిలువు దోపిడీ.. బట్టలూడదీసి.. కళ్లలో కారం చల్లి.. నడిరోడ్డుపై వదిలేసిన ప్రియురాలు..
నమ్మి వచ్చిన ప్రియుడి నిలువు దోపిడీ.. బట్టలూడదీసి.. కళ్లలో కారం చల్లి.. నడిరోడ్డుపై వదిలేసిన ప్రియురాలు..
ఓ మహిళ ప్రియుడిని దోచుకుని, వివస్త్రను చేసి, కళ్లలో కారం చల్లి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. మరో నలుగురిలో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది.

మహారాష్ట్ర : ముంబైలోని థానేలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రేమించినందుకు ఆ ప్రియుడిని నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టిందో ప్రియురాలు. నమ్మి వచ్చిన ప్రియుడిని నిలువు దోపిడీ చేసి.. బట్టలూడదీసి.. కళ్లలో కారం కొట్టి వదిలేసి వెళ్లిందో మహిళ. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో వెలుగు చూసింది.
ముంబైలోని షాహాపూర్ హైవేపై 30 ఏళ్ల మహిళ, మరో నలుగురు కలిసి మహిళ ప్రియుడిపై దాడి చేశారు. ఆ తరువాత అతడిని నగ్నంగా చేశారు. దీనికంటే ముందు అతని దగ్గరున్న నగదు, బంగారం దోచుకున్నారని పోలీసులు సోమవారం తెలిపారు. బాధితుడిని షాహాపూర్‌లో నివాసం ఉంటున్న బాలాజీ శివ్‌భగత్‌గా గుర్తించారు, అతను నిర్మాణ వ్యాపారం చేస్తున్నాడు.
ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని భావికా బోయిర్, నదీమ్ ఖాన్‌లుగా గుర్తించారు. శివభగత్ గత కొన్నేళ్లుగా భోయిర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. “జూన్ 28న, షాహాపూర్‌లోని అట్‌గావ్ హైవేపై కలుద్దామని సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో భోయిర్ శివ్‌భగత్‌ను పిలిచాడు. ఈ ప్రకారం ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు.
వారిద్దరూ మాట్లాడుకుంటుండగా.. భోయిర్ సహచరులు నలుగురు ఎక్కడి నుంచో సడెన్ గా వచ్చారు. వారు అప్పటినుంచి అతడిని వేధించడం మొదలుపెట్టారు. అలా మరుసటి రోజు ఉదయం వరకు అతనిపై దాడి చేస్తూనే ఉన్నారు. ప్రియురాలి కోసం అతను తెచ్చిన బహుమతులను ప్రియురాలు తీసుకుంది.
తరువాత అతని చేతి వేళ్లకున్న ఉంగరాలు, గొలుసు, నగదు దోచుకున్నారు. ఆ తరువాత ఒకడు అతడిని బెదిరించి.. బట్టలు విప్పేయమన్నాడు. అలా మరుసటి రోజు తెల్లవారుజామున బట్టలు లేకుండా షాహాపూర్ హైవేపై అతడిన పడేశారు”అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
షాహాపూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ ఉపాసే మాట్లాడుతూ.. "బాదితుడు వాంగ్మూలం ఇచ్చాడని.. నిందితులు తన బట్టలు తొలగించిన తర్వాత వీడియోను తీశారని చెప్పాడు. వారు అతని రెండు బంగారు గొలుసులు, ఏడు ఉంగరాలు తీసుకుని, అతని కళ్లలో కారం పోసి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వదిలేసి, పారిపోయారు.
పోలీసులు ఐదుగురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 365 (ఒక వ్యక్తిని రహస్యంగా, తప్పుగా నిర్బంధించాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ లేదా అపహరణ), 506 (నేరపూరిత బెదిరింపు)తోపాటు అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.