గొలుసు పోగొట్టుకుంటే.. గాజులిచ్చింది.. మానవత్వం బతికే ఉందని నిరూపించింది...
ఓ మహిళ ఆలయంలో తన బంగారు గొలుసు పోగొట్టుకుంది. యేడాది పాటు కష్టపడ్డదంతా దొంగలపాలైంది. దీంతో కన్నీరుమున్నీరయ్యింది. కానీ దేవుడు పంపినట్టుగా ఓ మహిళ వచ్చింది. ఆమెను ఓదార్చింది. తన చేతికున్న రెండు గాజులను ఆమె చేతిలో పెట్టి మాయమయ్యింది.

Thiruvathira temple festival
కొల్లాం : కొల్లాం జిల్లా, పత్తనాపురంలోని Pattaji Devi ఆలయంలో ఓ అద్భుతమైన ఘటన జరిగింది. మానవత్వం, మంచితనం మీద అది నమ్మకాన్ని, సాటి మనిషిపై విశ్వాసాన్ని పెంచింది. ఆలయంలో తిరువాతిర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలయానికి వచ్చిన ఓ మహిళ తన బంగారు గొలుసును పోగొట్టుకుంది. అది ఎవరైనా దొంగిలించారా? పడిపోయిందా? తెలియదు. ఈ ఘటన శనివారం నాడు జరిగింది.
Thiruvathira temple festival
సంవత్సరం పాటు కష్టపడి దాచుకున్న సొమ్ముతో చేయించుకున్న బంగారు గొలుసును ఉత్సావాల సమయంలో దేవుడికి ‘పొట్టు’ సమర్పించాలని వచ్చింది. అయితే అది చేయకముందే గొలునును పోగొట్టుకుంది. దీంతో ఎంత వెతికినా గొలుసు దొరకలేదు. ఏం చేయాలో తోచక కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టింది.
Thiruvathira temple festival
ఇది చూసిన ఓ మహిళ ఆమెను ఓదార్చింది. కాసేపు ఆమెతో పాటే కూర్చుని తనకు ధైర్యాన్నిచ్చింది. ఆ తరువాత వెళ్లేముందు తన చేతికి ఉణ్న రెండు బంగారు గాజులను తీసి ఆమెకు ఇచ్చి... వాటిని అమ్మి గొలుసు కొనుక్కోమని చెప్పింది. గొలుసు పోగొట్టుకన్న మహిళ కొట్టారక్కరకు చెందిన మంగట్టువీట్టిల్ సుభద్ర (68). ఆమె జీడిపప్పు కార్మికురాలు. ఏడాది పాటు పొదుపు చేసిన సొమ్ముతో గొలుసును కొనుగోలు చేసింది.
Thiruvathira temple festival
దీనికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో, సోషల్ మీడియా, ఆలయ అధికారులు నష్టపోయిన మహిళకు తన గాజులు ఇచ్చిన మహిళ కోసం వెతుకుతున్నారు. వారికి ఇంకా మహిళ ఆచూకీ లభించలేదు.