రాత్రి డ్యూటీనుంచి వచ్చిన భర్త.. ఇంట్లో ప్రియుడితో పట్టుబడిన భార్య.. చివరికి..
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. దీంతో అతను నిలదీయగా ప్రియుడితో కలిసి దాడి చేసింది.

కర్ణాటక : వివాహేతర సంబంధాలు ఎన్ని అనర్ధాలకు దారితీస్తున్నా.. అలాంటివి రోజూ ఎన్నో వెలుగులోకి వస్తున్నా.. సంబంధాల జోలికి వెళ్లకుండా ఉండడం లేదు. వాటి అంతిమ పరిణామంగా.. దారుణాలకు పాల్పడుతున్నారు.
దంపతుల్లో భార్యో.. భర్తో.. హతమవ్వడమో..హంతకులుగా మారడమో జరుగుతుంది. పచ్చని సంసారంలో.. ఈ అనైతిక సంబంధాలు చిచ్చు పెడుతూ… కాపురాల్ని నిట్టనిలువునా కూల్చేస్తున్నాయి.
పిల్లల్ని అనాధలుగా మారుస్తున్నాయి. అలాంటి ఘటన కర్ణాటకలో ఒకటి వెలుగు చూసింది. భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధం విషయంలో చెలరేగిన ఘర్షణ భర్త మీద దాడికి దారితీసింది.
కర్ణాటకలోని సూళగిరి సమీపంలో ఉన్న కారుబల గ్రామానికి చెందిన రామచంద్రన్ (38) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య రూప (28). ఆమెకు అదే ప్రాంతానికి చెందిన జావిద్ (21)తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం రామచంద్రన్ కి తెలిసింది. జూన్ 17వ తేదీన రాత్రి డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన రామచంద్రన్ కు ఇంట్లో జావిద్ కనిపించాడు. ఒక్కసారిగా కంగుతిన్న రామచంద్రన్ భార్యను, జావిద్ ను నిడదీశాడు.
దీంతో రూప తీవ్ర అగ్రహానికి లోనైంది. ప్రియుడు జావిద్ తో కలిసి భర్త మీద దాడికి దిగింది. వారిద్దరి దాడిలో రామచంద్రన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన అరుపులు, కేకలతో అక్కడికి చేరుకున్న స్థానికులు చికిత్స కోసం రామచంద్రన్ ను క్రిష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
దీనిమీద పోలీసులకు సమాచారం అందించడంతో.. రామచంద్రన్ పరిస్థితిని చూసిన పోలీసులు ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. జావిద్ ను అరెస్ట్ చేశారు.