PM Modi: ప్రపంచంలో మనం ఎవరికీ తక్కువ కాదు.. తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోడీ
PM Modi: "తేజస్ యుద్ధ విమానంలో ఒక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసాము. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. మన దేశ స్వదేశీ సామర్థ్యాలపై నా విశ్వాసాన్ని మరింతగా పెంచింది. మన దేశ శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని" ప్రధాని మోడీ అన్నారు.
PM Modi Takes Historic Sortie In Tejas: కర్ణాటకలోని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సైట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన పలు చిత్రాలను ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తేజస్ లో ప్రయాణించడం తనకెంతో గర్వంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. స్వావలంబనలో ప్రపంచంలో ఎవరికీ భారత్ ఏ మాత్రం తీసిపోదని తెలిపారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళం, డీఆర్డీవో, హెచ్ఏఎల్ లో పాటు భారతీయులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తర్వా త ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "తేజస్ యుద్ధ విమానంలో ఒక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసాము. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. మన దేశ స్వదేశీ సామర్థ్యాలపై నా విశ్వాసాన్ని మరింతగా పెంచింది. మన దేశ శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని" ప్రధాని మోడీ అన్నారు.
స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఈ ఏడాది జూలైలో భారత వైమానిక దళంలో ఏడేళ్ల సేవలను పూర్తి చేసింది. 2003లో తేజస్‌గా మార్చబడిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బహుళ-పాత్ర ప్లాట్‌ఫారమ్, దాని తరగతిలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది.
తేజస్ యుద్ధ విమానం ఎయిర్ డిఫెన్స్, మెరిటైమ్ రికనైసెన్స్ , స్ట్రైక్ పాత్రలను చేపట్టేందుకు రూపొందించబడింది. ఈ సామర్ధ్యం దాని మల్టీ-మోడ్ ఎయిర్‌బోర్న్ రాడార్, హెల్మెట్ మౌంటెడ్ డిస్‌ప్లే, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్, లేజర్ డిజిగ్నేషన్ పాడ్‌తో మరింత మెరుగుపరచబడింది.
మలేషియాలో లిమా-2019, దుబాయ్ ఎయిర్ షో-2021, 2021లో శ్రీలంక వైమానిక దళ వార్షికోత్సవ వేడుకలు, సింగపూర్ ఎయిర్ షో-2022, 2017 నుంచి 2023 వరకు ఏరో ఇండియా షోలతో సహా వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో తేజస్ యుద్ధ విమానాలను ప్రదర్శించడం ద్వారా ఐఏఎఫ్ భారతదేశ స్వదేశీ ఏరోస్పేస్ సామర్థ్యాలను ప్రదర్శించింది.
తేజస్ యుద్ధ విమానాలు ఇప్పటికే దేశీయంగా విదేశీ వైమానిక దళాలతో విన్యాసాలలో పాల్గొన్నప్పటికీ, 2023 మార్చిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఎక్స్-డెసర్ట్ ఫ్లాగ్ విదేశీ గడ్డపై తేజస్ మొదటి యుద్ధ విన్యాసంగా రికార్డు సృష్టించింది.
రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం 2021 ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 83 తేజస్ MK-1A జెట్‌ల కొనుగోలు కోసం ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ మేజర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ₹ 48,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.