MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Wayanad Lanslides: కేరళలో ప్రకృతి ప్రకోపం.. ఆనవాళ్లు లేకుండా పోయిన గ్రామాలు.. నేర్చుకోవాల్సిన గుణపాఠాలెన్నో

Wayanad Lanslides: కేరళలో ప్రకృతి ప్రకోపం.. ఆనవాళ్లు లేకుండా పోయిన గ్రామాలు.. నేర్చుకోవాల్సిన గుణపాఠాలెన్నో

కేరళలోని వయనాడ్ జిల్లా తీవ్ర ప్రకృతి విపత్తు‌ను ఎదుర్కొంటోంది. కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు కారణంగా వందలాది ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. 270 మందికి పైగా మృతి చెందారు. ఇంకా అనేక మంది ఆచూకీ తెలియట్లేదు. సహాయ చర్యలకు తాత్కాలిక బెయిలీ వంతెనలను సైన్యం నిర్మిస్తోంది.

2 Min read
Galam Venkata Rao
Published : Aug 01 2024, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కేరళలోని వయనాడ్ జిల్లా గత కొన్ని రోజులుగా తీవ్ర విపత్తును ఎదుర్కొంటోంది. భారీ వర్షాలు, కొండచరియల విరిగిపడటం కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయి చనిపోయిన వారి సంఖ్య 270 దాటింది. మరో 200 మందికి పైగా గల్లంతయ్యారు. వారి జాడ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఇంకా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రకృతి విపత్తు కేరళను వణికిస్తోంది.

27

కుండపోత వానలు, ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలతో వయనాడ్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, బురద, రాళ్లతో కూడిన వరదలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గ్రామాలకు గ్రామాలకు నామరూపాల్లేకుండా పోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండచరియల విరిగిపడటంతో వర్షం ఇంకా కురుస్తూనే ఉండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి.

37

ప్రకృతి ప్రకోపించడంతో వయనాడ్ జిల్లాలోని అనేక గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ విధ్వంసం ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. సైన్యం, సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడానికి తాత్కాలిక వంతెనలు నిర్మిస్తున్నారు. వాతావరణ శాఖ రెండు రోజులు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేరళలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

47

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, విపత్తు నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పవచ్చు. కేరళలో వరదలు, ప్రకృతి విపత్తులు మానవ తప్పిదాలతో కూడిన విషాదంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనడం కోసం విపత్తు నిర్వహణ చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.

57

వరదలతో కొండచరియలు విరిగిపడి సృష్టించిన ఈ బీభత్సవం కేరళ చూసిన అతిపెద్ద విపత్తుల్లో ఒకటి. వయనాడ్‌ జల్లాలోని ముండకై కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు కీలకమైన బెయిలీ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి వరకు కొనసాగిన వంతెన నిర్మాణం ఉదయం చివరి దశకు చేరుకుంది. ఈ వంతెనను ఆర్మీ సభ్యులు నిర్మిస్తున్నారు. గంటల వ్యవధిలో ముండకై వైపు ఉన్న భూమికి వంతెన అనుసంధానం కావచ్చని భావిస్తున్నారు. ఈ వంతెన పూర్తయితే బెయిలీ బ్రిడ్జి మీదుగా జేసీబీ లాంటి వాహనాలు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సహాయక చర్యలు చేపట్టడం మరింత సులభం అవుతుంది. 

67

వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం కేరళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెను విపత్తుగా మారుతోంది. మృతుల సంఖ్య 270కి చేరగా.. ముండకై, చలియార్‌లో ఇప్పటివరకు 98 మృతదేహాలను వెలికితీశారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత 75 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.

77

రెండో రోజు (బుధవారం) భారీ వర్షాలు, కొండలపై వరదలు రావడంతో సహాయక చర్యలకు పెద్ద సవాల్‌గా మారింది. చురల్‌మల వద్ద సహాయక చర్యల కోసం నిర్మించిన తాత్కాలిక వంతెన మునిగిపోయింది. దీంతో తాళ్ల సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 1,592 మందిని సైన్యం, బలగాలు రక్షించారు. 8,107 మంది సహాయక శిబిరాల్లో ఉన్నారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
Recommended image2
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
Recommended image3
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved